సిరా లేని కలాన్నైతి
కలం లేని కీసనైతి
కీసలేని అంగినైతి
అంగినైతి దోతినైతి
దోతినేతినా నేతన్ననైతిరా!
నేతన్ననైతినిరా మరచితివారా! నా ఈ ఘనత !!
సారం లేని పుడమినైతి
పువ్వులేని పంటనైతి
పంటనైతి, వంటనైతి
తింటే తిండినైతినిరైతునైతి!
రైతన్ననైతినిరా మరచితివారా! నా ఈ ఘనత !!
దారి లేని జాగనైతి
జాగలేని సదువురానీ మోద్దునైతి
దాటలేని అంద్దున్నైతి
అంద్దున్నైతి లిపినిగోల్పీన పంతులునైతి!
మరచితివారా! నా ఈ ఘనత !!
నేలనైతి నిప్పునైతి
నిండు కుండలో నీటినైతి
దాహం దీర్చిన దాతః నైతి
కుండనేర్చినా కుమ్మరినైతి! మరచితివారా! నా ఈ ఘనత !!
యెన్నో ఇంకెన్నెన్నో ఆవిష్కరించితి మరచితివారా! నా ఈ ఘనత !!
మానవత్వం నేర్చిన మన్నుమైతిమి
"మందునేర్సీ తాగనేర్సీ మంటలకాలవడితిమి"
(మద్యం మత్తులో మునిగి తేలుతున్నా మన సంపదను(సాటి మనిషులను) కాపాడుకుందాం!