మా రచయితలు

రచయిత పేరు:    నల్ల అజయ్

కవితలు

నేలకొరిగిన నెత్తుటి మందరాలు..!

పురుడుపోసి జన్మనిచ్చిన

తల్లి ప్రేమను కాదని

వేలాది తల్లుల ఆర్తనాదాలే

ఆప్యాయపు పలుకరీంపై అభ్యుదయం వైపు అడుగులు

వేసిన అడవి బిడ్డలు...

                                

అడవిని అమ్మగా హత్తుకొని

వాగు వంకలను ముద్దాడుతూ వేకువవైపు అడుగులు వేస్తూ

దారి పొడవున దారుణంగా చంపబడుతున్న మార్గానిర్ధేశాలు...

                        

మనం మారితే జనం మారతారు

జనం మారితే జాతి మారుతుందని

జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు అల్లుకుపోయిన నెత్తుటి మందారమై వికసించిన

ఎర్రని పరిమళాలు...

                               

వెలివాడలో పురుడుపోసుకొని

వాడ వాడని అధ్యయనం చేసి భవిష్యత్ భారాన్ని

భుజాలపై మోస్తూ

తుపాకీ తూటాలకు ఎదురెలుతూ

వీరమరణం పొందిన

వేగుచుక్కలు..!      

       

జోహార్ కామ్రేడ్స్.

 

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు