మా రచయితలు

రచయిత పేరు:    ఆది రెడ్డి

కవితలు

బలి పశువులు

బతుకు

ముందు ముందెట్ల ఉంటదో

సమజైతలేదు

ఎనుకటి రోజులు గావాయె

ఉన్నదో లేందో తీని

కలో గంజోతాగి  కాలమెల్లదీయడానికి

ప్రపంచమంతా కళ్ళముందుకొచ్చె

భాష ఏసం రుచి ఆభిరుచి

అన్నీమారే

ఆశలకు రెక్కలొచ్చి

దేశాల హద్దులు దాటితిమి

కాని కాలమొచ్చి

కలల సౌధాలు

కళ్ళముందే కూలతుండె

ఇప్పుడు పరుగెత్తి పాలు తాగడం కాదు

నిలకడగా నిలబడితే సాలు

మొత్తానికి జీవితమైతే

సాపు సీదగా నడిచెటట్లు

కనబడుతలేదు

జరిగిందో లెక్క

జరుగబోయేదో లెక్క

గవర్నమెంటు గూడ గాయి గాయి

అయితాంది

రాబడి లేక రాజసందప్పె

పైసల కొరకు పై సూపులాయే

హెలిక్యాప్టర్ మనీ ఏమన్నా

రాలుతుందేమోనని

పై వాడు కరుణిస్తేగా

సేసుకున్నవాళ్ళకు సేసుకున్నంత

అనుభవించండని

చోద్యము చూడటం తప్ప

ఆటలో బలిపశువులు

అంతిమంగా మామూలు  మనుషులే

 

ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు