మా రచయితలు

రచయిత పేరు:    ప్రేమ్

కవితలు

మనిషిగా!

మీరే మతంతో చూసిన

నాకైతే ఏ మతము లేదు

మీరే కులంతో చూసిన

నేనే కులానికి చెందను

కాని

మానవత్వంలో

మీ అందరికంటే

ముందున్నవాన్ని

నేను సైన్‍టిస్టుని

నేను డాక్టర్ని

మీ దేవుల్లంత

తలుపుల వెనకాలే

వుండిపోయారు

నేను మీ కోసం

తలుపులు తెరుచుకొని

వస్తున్నాను మనిషిగా

కరోనాను పెకిలిస్తూ

మరణాన్ని ఎదిరిస్తూ

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు