మా బ్రతుకులు నిత్యం ఏవో
సమస్యలతో యుద్దాలు చేస్తాయి
అయినా ఇవి సరిపోవు అన్నట్టు
కొత్తగా కరోనా...
బలిసినోడు బతుకుదెరువు
కోసం పోయి తెచ్చిన రోగము
ముట్టుకుంటే అంటుకునే రోగము
మా బతుకుల్లో మంటలు రేపే రోగము.
మా ఉపాధి కరువై
ఉపాసం ఉంచిన రోగము
మీకు తెలుసా ఆకలి ఎంత భయంకరమైనదో
మూడు పూటలు తినాల్సిన కడుపులు
ఒక్క పూట తిని రెండు పూటలా పస్తులుంటే
దీన్ని బాధ అనాలో
భావన అనాలో తెలియదు
ఈ పసివాడికి కూడా తెలియదు
తన తల్లి కడుపునిండా తింటేనే
వాడి నోటికి పాలు వస్తాయని
వాడి కంటికి నిద్రిస్తుంది అని
ఇంకా వాడికి తెలియదు
పుట్టుకతోనే అంటరానితనంతో
పాటు ఆకలిని కూడా తోడు
తెచ్చుకున్నానని...
నిజంగా ఆ పసివాడికి తెలియదు
పెద్దవుతుంటే
సమాజం నువ్ పేదవాడివి
కడ జతి వానివని
ఛీ...... కొడుతుందని
ఆ తల్లికి కూడా తెలియదు
కడుపుకి అన్నం లేక
కన్న కొడుకుకి చనుపాలు అందని
రోజు వస్తుందని
అంటరానితనాన్ని
అడుగు అడుగు
భరించరాని
ఈ ఆకలిని ఇంకా ఎన్ని రోజులు
భరించాలో
చివరకి బ్రతుకుతామో చస్తామో
అయిన కానీ నాకు తెలుసు
జాతి వివక్షత పేరుతో
మమ్ములను పేదవాళ్ళని చేసిన ఆ మనువాదులను
ఎలా తిప్పి కొట్టాలో
ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో
ఆ తల్లినిగన్న తల్లికి తెలుసు
వాళ్ళ తాతా ముత్తాతలకు తెలుసు
ఈ భూమాతక్కూడా తెలుసు
ఈ కులం పేరుతో వచ్చిన
పేదరికాన్ని.....పోగొట్టుకోవాలంటే
ఏదో ఒక్క రోజు మన
రాజ్యాన్ని నిర్మించుకోవాలి
రాజ్యాధికారం రావాలని
అందుకు
ఈ మట్టిలోనే పుట్టిన కొందరు బిడ్డలు
కులం పేరుతో చీల్చిన
ఆ మనువాదులతో
సమానత్వం కై ఇప్పటికీ
ఇంకా పోరాడుతున్నారని