ఇది నిర్జీవం నుండి లేచిన విషపు ధూళి ఈ కరోన జీవం పోసుకొని చెలరేగుతుంది...
ప్రాణులను పసిగట్టి జీవికి జీవికి మధ్య ఉన్న రహస్యాన్ని విప్పి రంకెలేస్తుంది...
గడియ తీరిక లేకుండా గాలిలో తిరుగుతూ గ్రామ గ్రామాలను గాబరా గాబరా చేస్తుంది...
కన్నీరు కూడా లేని పరిస్థితులను తెచ్చింది నీట్ గా నీళ్లతో కడుక్కోమని నిక్కచ్చిగా నిగ్గుదేల్చుతుంది...
ఎంత శుభ్రతగా ఉన్న ఇంకా ఏదో భయంకరమైన సురుకులు అంటిస్తూనే ఉంది...
పెట్టెలు పడేసిన , డబ్బాలు ఖాళీ చేసిన డబ్బుకు లొంగని జబ్బునని తేల్చేసింది...
ఎన్నో కష్టా ,నష్ట లను మైమరిపించే మత్తు ను సైతం ముంచెత్తుతు మత్తుకు బానిసను కాదు అని కుండ బద్దలు కొడుతుంది...
రౌడీయిజం , రాజకీయం ఏవి నాకు అతీతం కావని రాజీపడనని రాజ్యాన్నేలుతూ చూపిస్తుంది...
మీరు మునిగి పోతున్న కులం కంపుతో నాకు పనిలేదని ప్రవహిస్తూనే ఉంది...
మతిస్థిమితం లేకుండా మానవత్వం లేకుండా
మతం మత్తులో ఉన్న మీరు నన్ను మట్టు పెట్టలేరని మౌనంగా వ్యాపిస్తూనే ఉంది...
మతిలేని మంత్రాలు చింతకాయల్ని రాల్చలేవని తెలుసుకొని రగులుతూ శవాల్ని రాల్పుతుంది...
దేవుడు ఒంటరై పూజ కు పువ్వు కు నోచుకోక తలుపులేసుకున్నాడు నివారించలేరని నిలువుగా నిలదిస్తుంది...
తప్పు చేసినవాన్ని జైల్లో బంధిస్తావు కానీ నేను జైలు గోడలనే బద్దలుకోడితి ఎలా బంధిస్తావని భయపెడుతోంది...
తూటాలు జులిపిస్తావా నీ తుపాకికే నేను తూట్లు పొడిస్తి ఎలా పట్టుకుంటావాని పగలబడి నవ్వుతుంది...
ఉరిశిక్ష వేస్తావా ఊపిరాడకుండానే చేస్తి ఊచకోత కొస్తున్నాను అని ఉచ్చరిస్తుంది...
యుద్ధం చేసి నన్ను గెలుస్తావా నేనే యుద్ధం ప్రకటిస్తి యుద్ధం లో మరణించిన శవాలను కూడా చూడరని సూచిస్తుంది...
చేతులు కడుక్కుని శుభ్రంగా ఉంటావా కడుక్కున్న చేతులతో కూడా కరచాలనం చేయలేవు అని చంపపై కొట్టినట్టే చెబుతుంది...
నిర్బంధం నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నవా బయటికొస్తే బ్రతుకు భారం అని భయబ్రాంతులకు గురిచేస్తుంది...
నాకంటే నువు గట్టి పడు ...
నీ కై నేవే పోరాడు ...
నీ సమాజాన్ని నువ్వే కాపాడు...
అందుకు...
నీ మనుగడ
నీ చుట్టూ ఏర్పడిన ప్రకృతే
మానవుని మనుగడ కు ఆధారం చెట్లు...
కాబట్టి ఆ ప్రకృతిని కాపాడు.
పర్యావరణాన్ని కాలుష్యం చేసిన
పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసిన
దాని పరిణామాలు ఈ విదంగానే ఉంటాయని అవగాహన చేసుకో...
ఒక మంచి మనిషిగా కాకపోయినా
ఒక మనిషిగా బ్రతుకు నీకు ఏమి లేకపోయినా ఆ ప్రకృతే నిన్ను నీ సమాజాన్ని తల్లిలా లాలిస్తుంది,పాలిస్తుంది...
కాబట్టి ఇకనైనా
పర్యావరణాన్ని కాపాడుకుందాం...
కోల్పోయిన మన మానవ మనుగడను సాదించుకుందాం...
అందరం బాధ్యతగా
ప్రకృతి వినాశనాన్ని అరికడుదాం...
మనం ప్రకృతిని ప్రేమిద్దాం...
పర్యావరణాన్ని కాపాడుకుందాం...
మనిషి మనుగడను కాపాడుదాం...