గోముగా మా అమ్మ
గుండెకు హత్తుకున్న ప్రేమ!
గోరుముద్దలలో రంగరించి
తినిపించిన తియ్యదనాల చిరునామ!
నాన్న వీపుపై
గుర్రమెక్కి ఆడిన హంగామా!
వెన్నెల్లో విన్న
మధుర కథల నవనీతమా!
బుడి బుడి అడగుల
ముసిముసి నవ్వుల మాటల మాణిక్యమా!
నిన్నెనడు
మరిచానని..?
నా ఎద సడే నీవైతే!
నా తల్లి ఒడే నీవైతే!!
ఓ..మాతృభాష మమకారమా!
నను వీడని నా నేస్తమా!!