ప్రశాంతంగా కనిపించే సముద్రంలో కనపడకుండా కల్లోలం కలిగించే అలలను చూసి నా కలం కదిలినపుడు కవనం నేను
అందమైన ప్రకృతి లో ఆనందాన్ని కలిగించే
ఆమని ఋతువులో విరిసిన సుమాల సౌరభాలు చూసినప్పుడు ప్రేక్షకుడిని నేను
మనసుకు నచ్చిన వారు మనోవేదనకు లోనై
మనశ్శాంతి కోసం నన్ను ఆశ్రయించినప్పుడు ఓదార్పు నిచ్చే ఓ మంచి నేస్తాన్ని నేను
పగలు రేయి తేడా తెలియని పాల నురగ లాంటి పసిపాప బోసినవ్వులు పువ్వులు చూసి మురిసిపోయే నవయుగ నేత నేను
సమాజంలో జరుగుతున్న సంఘటనలను
సామాన్య ప్రజల కళ్ళకు కట్టినట్లు మనసుకు నచ్చినట్లు వర్ణించే రచయిత ను నేను
శిశిరంలో రాలిన చెట్లు ఆకులను చూసి తరువులు ఆవేధన చెందినపుడు
ఆదరించే ఆత్మీయ బంధువును నేను
భవిష్యత్ ప్రయాణం లో బాధలతో విసిగిపోయిన యువతకు ఊరటనిచ్చి దారి చూపే తోడుగా నిలిచే మార్గదర్శి నేను
కథలు,కల్పనలు,కావ్యాలకు ధీటుగా
సకల చరాచర ప్రపంచంలో జరిగే విపత్తులను రవి కాంచలేని చోటును దర్శించే కవిని నేను