మా రచయితలు

రచయిత పేరు:    జోడు కార్తిక్

కవితలు

అందం

కళ్లా అవి ?

ఒక్కసారి చూస్తే చాలు జీవితమంత మదిలో ఆనందపు హరివిల్లు

నీ చూపుల బాణాలు ఎదలో గుచ్చుకున్న ప్రేమ ముళ్ళు...

 

పళ్లా అవి?

నీ నోటిలో వెలసిన ముత్యాల వరుసలు

నీ నోటినుండి వచ్చే ఒక్కొక్క పలుకు తియ్యని తేనె చినుకు...

 

చెవులా అవి?

నా ప్రేమగీతాన్ని నీ మదికి చేర్చే  సాధనములు

నువ్వు వినే ఒక్కొక్క పదం నీపై నా భావాలను తెలిపే మరో వేదం...

 

ముక్కా అది?

నిత్యం సుగంధాన్ని పీల్చే  కోమలమైన తామర రేకు

నువ్వు పీల్చే కమ్మటి వాసన నేను నీకొరకై పంపిన కుసుమాల సువాసన...

 

జడ నా అది?

పగటిలో సైతం నిశీధిని చూపే  నల్లని వెంట్రుకల మేడ,

నువ్వు నీ శిరస్సులో పెట్టె పూలు నేను నీకై పంపిన నక్షత్రాలు...

 

చేతులా అవి?

నాపై నీ ప్రేమను లిఖించే మృదువైన కలములు,

నీ చేతి వేళ్ళు తాకి శిల్పాలుగా మారే ఎన్నో బండరాళ్లు...

 

పాదాల అవి?

స్పర్శ తగలగానే ప్రకృతిలో వెలుగుని నింపే నాదాలు,

నీ కాలి వేళ్ళకి మట్టి అంటిన తట్టుకోవు నా కళ్ళు...

 

మేనా అది?

అనుక్షణం పరిమళాలు వెదజల్లే పూల చేను,

నీ రాకకై కణ కణం తపించెను,

నీ రాకతో అణువణువు తరించెను...

 

నీ చల్లని ప్రేమగాలి తగలగానే నా ఊపిరి

 ఊపిరి

పోసుకుంది,

నా గుండె నిరంతరం నీకోసమే కొట్టుకుంటుంది,

నా హృదయం నిత్యం నిన్ను వీక్షిస్తుంది,

నీ ప్రతిబింబం ప్రతిరోజు ప్రతిమై నా కలలో కనిపిస్తుంది,

నా ప్రేమ అనునిత్యం నిన్ను రక్షిస్తుంది,

నా ప్రాణం పరితపిస్తూ నీకై అనుక్షణం వేచి చూస్తుంది...

 

             

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు