అమ్మా!
నీవున్న ఇల్లు
ఒక దేవాలయం.
అమ్మా
నీ నవ్వులు వింటే,
ప్రపంచాన్నే గెలిచినట్టుగా ఉంది.
అమ్మా!
నీవు నాతో గడిపిన క్షణాలు నరకంలో అయినా స్వర్గం లాగా ఉంది.
అమ్మా! నీవు
గోరుముద్దలు పెడుతుంటే
నీ చేతి స్పర్శ తాకి
విషం కూడా అమృతం
లాగా మారింది.
అమ్మా!
నీవున్న క్షణంలో ఒంటరినైనా
పదిమందితో ఉన్నట్టుంది.
అమ్మా!
నీవున్న వేళ ఎర్రటి ఎండలు చల్లటి గాలిని పంచాయి.
అమ్మా!
నీవున్న వేళ
సుడిగాలి సైతం
నన్ను తెగ సంబురపెడుతుంది.
అమ్మా నీవు లేని ఇల్లు దెయ్యాల కోటగా మారింది.
అమ్మా!
నీ నవ్వులు లేని వేళ కోయిల స్వరం కూడా కాకి అరుపులుగా వినిపిస్తున్నాయి.
అమ్మా నీ తోడు లేని స్వర్గం కూడా నరకం లా తోస్తుంది.
అమ్మా!
నీ చేతి స్పర్శకు దూరమైన అమృతం కూడా విషం లాగా మారింది.
అమ్మా !
నీవు లేని లోకంలో పదిమందితో ఉన్నా
ఒంటరై ఉన్నా.
అమ్మా !
నీవు లేని వేళ చల్లటి సాయంత్రం కూడా
ఎర్రటి ఎండ వలె సెగలు రేపుతుంది.
అమ్మా నీవు లేని
గాలి సుడిగాలిగా
మారి నా ప్రాణాలు తీస్తుంది.