మా రచయితలు

రచయిత పేరు:    వేంకటేశ్వర రామి శెట్టి

కవితలు

అమ్మంటే

అమ్మంటే ఆప్యాయత లోగిలి

అమ్మంటే అభిమానపు వాకిలి

మోస్తుoది అవని లా

కాస్తుoది దైవం లా

 

అమ్మంటే సృస్ట కి ప్రాణాధారo

అమ్మంటే దైవానికి మరో రూపం

 

అమ్మంటే అనురాగపు ఆకారం

అమ్మంటే మమకారపు ప్రాకారం

అమ్మ పాట సుస్వరాల సయ్యాట

అమ్మ ఆట ఆరోగ్యపు సిరి తోట

 

జనని రక్తమాంసాలే మన తనువు కు ఆధారo

తన బిడ్డల క్షేమమే అమ్మ బ్రతుకు పోరాటo

అమ్మంటే నిర్మల సుర గంగా జలం

అమ్మంటే తరతరాల నవ నిర్మాణo

 

అమ్మ మాట వెలుగు చూపు సూర్యుని కిరణం

అమ్మ ప్రేమ జాబిలమ్మ పున్నమి చరణం

అమ్మంటే అంతులేని వాత్సల్యo

అమ్మంటే మానవత్వ ఔన్నత్యం

 

కష్టాలను కన్నీళ్ళను దిగమిoగిన ధీరమూర్తి

మన బ్రతుకున పుష్పవనo పూయిoచే త్యాగమూర్తి

అమ్మంటే నడిచేటి వెలుగు రూపం

అమ్మంటే నాన్న వెంట ఉండే ధైర్యం

 

మన భవిత నిర్మాణపు నిచ్చినే మాతృమూర్తి

సకల జీవరాశుల కు తానేలే ప్రేమ స్పూర్తి

అమ్మంటే త్యాగాల చిరునామా

అమ్మంటే విజయాల వీలునామా

 

వయసు మీద పడినా తరగదు తన అనురాగం

స్రుశ్టి లోని పాత్రలలో అమ్మ పాత్ర ప్రత్యేకo

అమ్మంటే చిరునవ్వుల చిరుజల్లులు

అమ్ముoటే విజయాల హరివిల్లులు

 

అమ్మ లేక జీవుల కు జన్మ అసాధ్యం

సేవలేన్ని చేసినా తీరదు లే అమ్మ రుణం

అమ్మంటే శివ శిఖరపు హిమపాతo అమ్మ మనసు ఆకాశపు అనంతం

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు