మా రచయితలు

రచయిత పేరు:    ములుగు లక్ష్మీమైథిలి

కవితలు

ఎలా చెప్పను

ఏమని చెప్పను చెల్లి
తోడేలు తోలు కప్పుకున్న
మానవ మృగాలు
మన మధ్యే తిరుగుతున్నాయని

ఏమని చెప్పను చెల్లి
మానవి రక్తం రుచి మరిగిన పులులు
పక్కనే మాటు వేసి ఉన్నాయని
ఆదమరిస్తే దాడి చేస్తాయని

ఏమని చెప్పను చెల్లి
నువు వెళ్ళేదారిలో
ముళ్ళు.. రాళ్లేకాదు..
కాటేసే కాలనాగులు ఉంటాయని

ఇపుడు చెపుతున్నా చెల్లి
రుద్రమదేవిలా కత్తి పట్టే రోజొచ్చిందని
వంటింట్లో కూరలు తరగటం కాదమ్మా
రోడ్డు పై సంచరించే
మృగాళ్ల తెగనరకాల్సి వస్తుందనీ
నీచులను నిలువునా తగలెట్టే వంతు
ఇకపై నీ ఖాతాలో చేరుతుందని
ధైర్యం గా ముందుకు అడుగు వేయమని
నీ దారిలో అడ్డొచ్చిన విష పురుగుల ను
కాలికింద అణచివేయి ...
ఎన్నాళ్ళీ అరాచకాలు..
తెగువ చూపించు.. ఆదిశక్తివై
దుర్మదాందులను హతమార్చి..
నీ ఉనికిని నిలబెట్టుకో చెల్లి..!!


 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు