మా రచయితలు

రచయిత పేరు:    యస్ పూర్ణిమ

కవితలు

ఇక పై జాగ్రత్త గా...

నిర్భంధం  నుండి నడకలు

 గుమ్మం దాటి బయటకు వేస్తే..

నీడలా, పొంచి ఎవర్ని చేరి

సమూల౦గా ముంచుతుందో

యెప్పుడెవరిని ఎవరికీ కాకుండా చేస్తుందో..

ఎవరికేంతెలుసు?

 

అడుగడుగునా అటకాయించడానికి

 ఏ మూల, ఏ సందులోంచి

ఏ గొంతు లోంచి  వస్తుందో,

హద్దుా పొద్దు  లేదు.

ఎవరూ చూడని నిశ్శబ్దంలా

ఎవరికీ కనిపించని కరోనా

 అదృశ్యంగా...అలా..

 

మనిషి నే ఆసరాగా

ఊపిరితిత్తులే నివాసంగా

తన ఉనికి తో

మనిషి  ఉనికినే లేకుండా చేస్తూ..

మనిషిని కబళిస్తూ కరోనా ఇలా ..

 

 

ఎక్కడికెళ్లినా ఏం చేసినా 

శాశ్వత విశ్రాంతే గతి.

యుద్ధంలో ఆయుథాలుంటాయి..

కానీ

కరోనాతో  పోరాటానికి ఆయుథం

 ఇంకా తయారీలోనే ఉంది.

ఇన్నాళ్లు ఇళ్ళలో  నిర్భందం గా ..

ఇంకెన్నాళ్ళని వీరవిహారం చేస్తే..

చెబుతూనే ఉన్నారు కదా ..

మీరు బయట ఉంటే

కరోనా ఇంట్లో ఉంటుంది .

మీరు ఇంట్లో ఉంటే

 కరోనా బయట ఉంటుంది .

ఇంట్లో ఉండటమే రక్షణ,

 పరిశుభ్రతే పరిరక్షణ.

ఈ సంచికలో...                     

Nov 2020