కరోనా కాచుక్కూర్చుంది
కాలు కదిపితే కాటేసి
కాటికి ఒంటరిగా పంపనుంది
ప్రపంచం అంతా ప్రాణభయంతో లాక్ డౌన్ అందీ
లాక్ డౌన్ తో కరోనా కతమైతానందెమో
ఒక్కరోజే అనుకున్నాం
చప్పట్లు కొట్టాం ధశ దినం అనుకోనీ దీపాలు పెట్టాం
కరోనా ఖతం అనుకున్నాం
ఇక తాలాలు తీస్తారనుకున్నాం రెక్కలాడు తాయనుకున్నాం
నెలరోజులన్నారు గుండెలు
ఆగినంత పనైంది గుబులు
మెదలైంది ఇక్కడెట్ల బతకాలే
రెక్కలు ఆడనిదే డొక్కలు
నిండని కూలి బతుకులు
బతుకుజీవుడా అనే వలసబతుకులు
ఆకలి ఆగం ఆగం చేయబట్టే
సొంత ఊరు గుర్తుకొచ్చే
బస్సు బండ్లు బందు అయ్యే
బతుకు మీద ఆశపుట్టే
బాధలేమో మెండుగాయే
బాటపయనమే తోచబట్టే
మూటముల్లే సదురుకుంటీ
సంటిపిల్లల సంకనెత్తుకుంటీ
ఇంటిదేమో ఎంటిదికాదాయే
కాలినడకన కదిలితిమి
ఎర్రటెండలు అగడుగాలులు
కాల్లు కమిలే దూపపుట్టే
నిప్పులున్నయి కానీ నీల్లు లేవు
ఆరిన గొంతులు కారిన కాల్ల
నెత్తురు దారిన ఎర్రటిమరకలు
నిప్పుల గుండాల్లో నడక
వందల కిలోమీటర్ల నరకం
ఇల్లు చేరాలనే ఆత్మ నిర్భరం
వట్టి మనిషి కాని ఇంటిది
రోడ్డు పక్కన చెట్టు కిందే
తల్లడిల్లి మరోసారి తల్లైంది
పసిగుడ్డుతో పాదయాత్ర కొనసాగుతుంది గమ్యం
చేరాలంటే గమనం తప్పదు
వలసకూలీల నడక వ్యతలు
నేటికీ నడుస్తూనే ఉన్నా
విదేశాల్లో ఉన్న స్వదేశీయులకు
విమానాల్లో ఇల్లుచేర్ఛడం భలా
దేశలో ఉన్నకూలీలంటే అలా
సుప్రీం చెప్పిందటగా కూలీలను
ఎవరు ఆపలేము వారికి
నడిచి పోవాలని కోరికుందని
అప్పుడు అర్ధం అయ్యింది కోర్టు అంటే ?
కాలినడకన ఊరు జెరే బాటసారులు ఎంతమందో
ఇల్లు జేరినవారెందరో
మార్గం మధ్యలో మరణించిన
వారు ఎందరో ఆ దారికే ఎరుక
లేఖరాసి సైకిల్ దొంగలైనారు
రాయని చెప్పుల దొంగలెందరో
నీల్లకు అల్లాడిన గొంతుకలెన్నో
ఎండిన రొమ్ముల చనుపాల
కెదిరి చూసిన పసిహృదయాలెన్నో
లాక్ అయిన కడుపు తాలంతీయక
కాలుకదపక ఆకలని అడగక
ఉరిపోసుకు కాటికి సాగిన కుటుంబాలెన్నో
ఆకలితో దారిలోనే కాలం
చేసిన కడుపులెన్నో
గమ్యం చేరకనే గతించిన జీవితాలెన్నో
కరోనాను తెచ్చింది ఎవడు
కరోనా కరువుతో చచ్చింది ఎవడు