మా రచయితలు

రచయిత పేరు:    కె సత్యశ్రీ

కవితలు

తెలుగు 

తెలుగు భాష ప్రాముఖ్యం తెలుసుకో .......

తల్లి తియ్యదనం తెలుగు

అందమైన అమ్మధనం తెలుగు

మన మనోరంధం తెలుగు

మన సుమగంధం తెలుగు

మన ప్రాచీనం తెలుగు

వేమన పద్యాలు తెలుగు

అన్నమయ్య కీర్తనలు తెలుగు

నన్నయ్య భారతం తెలుగు

అల్లసాని మను చరిత్ర తెలుగు

సినారె విశ్వంభర తెలుగు

శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు

శతకాల ఖజానా తెలుగు

సామెతల భారానా తెలుగు

పదాల పరవళ్లు తెలుగు

వాక్యాల ఉంపొసొంపు తెలుగు

ఉత్పలమాల , చంపకమాల తెలుగు

సంక్రాంతి సందడి తెలుగు

ఉగాది షడ్రుచులు తెలుగు

దీపావళి కాంతులు తెలుగు

దసరా సంతోషం తెలుగు

హోళి రంగులు తెలుగు

ముద్దులొలుకు మాతృభాష తెలుగు

మరువబోకు తెలుగు

ఇదే మనకు వెలుగు

దేశ భాషలందు లెస్స తెలుగు !!

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు