మా రచయితలు

రచయిత పేరు:    భావన చవగాని

కవితలు

నీ తోడుంటా...

వీచే గాలిలో సుగంధం

మ్రోగే ధ్వని లో సంగీతం

నా మనుసుని తాకే ఆనందం

నీ వల్లనే ---

 

నా కన్నుల కంటిని నీ రూపం

మతి పోగొట్టేలా దరహాసం

తహతహలాడేను నా ప్రాణం

తోడుండేందుకు చిరకాలం

 

కన్నుల్లో నీ రూపం --

పెదవులపై విరిసీ వీయని నవ్వులు

మాటలు కోయిల పాటలుగా మారి,

మనసు మయూరిలా  నర్తిస్తుండగా

ఆగిపోయిన కాలంలో నేను ఆగేవరకు

వెలుగారని కన్నుల్లో చీకటి చేరేవరకు

నీ తోడుంటా ----

 

జీవితాన తరగని ఆనందపు అక్షయ పాత్రనై

నడిరాత్రి సైతం దారి చూపే నీడనై

నీ తోడుంటా ------

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు