ఆశల దారాలతో
అల్లుకున్న
నీ ఆశయసౌధం
దూరమైనప్పుడే
నువ్
మరణించావు!
ఆరారో అంటూ
తమఆరోప్రాణంగా
కని పెంచిన
అమృతమూర్తులు
నిను వీడినప్పుడే
కోటి కోరికలతో
నిన్ను ఆహ్వానించిన
జీవితం
నీ చేజారినప్పుడే
మరణించావు !
నీకన్నా
నువ్ ప్రేమించిన
నీ ప్రేమతో పెంచిన
నీ మనసు
చేయని తప్పుకు
కాలం విధించిన శిక్ష కు
లోకం కాకులు
గొంతెత్తి కర్కశ రాగాల
కచేరీ విని విని
విసుగెత్తినప్పుడె
నీవు
నీది కాని జీవితంలో..
నీవు నీవుగా
బ్రతకనప్పుడే
మరణించావు
ఆశ తప్పా
ప్రేమలేని
మనుషులతో
మసలినప్పుడే
దేని వలన
మరణించగలవని
ఇంకా దేనిగురించి
ఇపుడు
భయపడుతావు
అసలు
మరణించేందుకేమి
మిగిలివుందని?
కొత్తగా
మరణించెందుకేముందని?
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
Feb 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
మరాఠీ రచయిత్రుల ఆత్మకథలు
ఇంటర్వ్యూలు