మా రచయితలు

రచయిత పేరు:    వి.కుసుమ రవళి

కవితలు

వలస కూలీలమండీ మేము.....!!!

వలస కూలీలమండీ మేము.....!!! అలల ప్రయాణం అయినది మా జీవితం....

అలసట తీరని మా పయనం తీరానికి చేరేదెన్నడు?? వెళ్ళొస్తాము అన్న పదంతో మొదలయిన ఈ ప్రయాణం... వచ్చేసాము అనే పదంతో ముగిసేనా??

కూలి పనితో కడుపు నిండే మాకు...

నేడు కూలేడ దొరుకును??

కూడేడ దొరుకును??

గొడ్డు కైనా గూడు దొరుకును.... మనిషిగా పుట్టినా గూడేడ వెతుకును??

వెతికినా...!! అద్దెలా ఇచ్చును నేను??

కన్నీరు కార్చా?? రక్తము చిందించా??

బస్తాను మోసిన భుజము బరువెక్కలేదే...

బాధను మోయగా మనసే బరువైనది??

ఆశతో చూసే అమ్మ అయ్యకు తిరిగి వచ్చినాను అన్న ఆనందాన్ని ఇచ్చేదెన్నడు??

ఆ సంతోషాన్ని చూసేదెన్నడు??

 

అర్థం చేసుకోండి

ఆడపిల్ల కష్టాలను కడలితో పోల్చవచ్చు....

నెలకు నాలుగు రోజుల నరకం...

ఆడపిల్లగా మరచి

అంటరానిదానిలా చూసేలోకం...

చలనంలేని ఒక శవమై

నొప్పితో ఓర్పుగా ఉండాలి...

శరీరంలో అనువనువునా రక్తం జలగలా పీల్చుతుంటే...

నరనరములో  ఓపిక నశించి వాలిపోతుంటే...

పొత్తు కడుపును కత్తులు చీల్చినట్లుగా

నొప్పిని భరిస్తుంటే...

నడుమ వాల్చలేక ...

అడుగు వేయలేక...

ఏమి చేయలేక ...

బాధ భరించలేక ...

కన్నీరు పెట్టుకుంటున్న ఆడపిల్లను అర్ధం చేస్కోని గౌరవించండి...

 

దళిత బతుకులండి మావి...

దళిత బతుకులండి మావి...

చావుకి సిధ్ధంగా బతుకుకి దూరంగా ఉన్న బతుకులలో

కూడు కోసం కొట్లాట...నీరు కోసం నిరీక౫ణ...

హీనమైన బతుకే కాని హీనమైన మనుషులం కాదే??

ప్రభుత్వాలు మారినా ..పదవులు మారినా...

గూడు కోసం గుడ్డ కోసం....కూడు కోసం కూలి కోసం మా ఎదురుచూపులుకు  కన్నీలకు ఆనకట్టే                                                                                                                      లేదా ???

దేనిలో ప్రవేశం లేదు .. ప్రశ్నించే హక్కు లేదా ??

దళిత వాడు పేదవాడు.. పనివాడా ?? తేడా లేదా ??

దళితవాడు ఒక పేదవాడు గా నే ఒదిగి ఉండాలా??

ఈ సంచికలో...                     

Nov 2020