మా రచయితలు

రచయిత పేరు:    శివ కృష్ణ

కవితలు

అంధుల ప్రపంచం
 

సర్వేంద్రియాలున్నా

సర్వం చూడలేమన్నా

మా మనస్సు ముగబోయిందన్నా

అందరూ చూసే నేత్రాలు మా పాలిట శాపాలు

అందమైన ప్రపంచంలో ఉన్నాం

అందరిని చూడలేమన్న బాధ

రాత్రి పగలు మారుతాయి లోకానికి

మాకు ఒకే సమయం వెలుగులేని జీవితాలకి

జగత్ వెలుగులో మీరు

జన్మనిచ్చిన అమ్మని చూడలేము మేము

Be respect in blind peoples

ఆన్లైన్ ఎడ్యుకేషన్

అగ్గిపెట్ట ఆకారం అంటా

అరచేతిలో వైకుంఠమట

అటకెక్కిన పుస్తకాలంటా

అద్దాలలో ఆన్లైన్ క్లాసులట

అర్థంకాని మూగమనస్సులంటా

ఆకర్షణలో మాయలోకమట

సందిగ్ధంలో పిల్లలంటా

సర్వలోకం ఆన్లైన్ ఎడ్యుకేషన్ వెంట

 

ఈ సంచికలో...                     

Nov 2020