గుండెల బాధ
ఎదల మోత
ఏమని చెప్పను
ఎట్లా అని చెప్పను
ఎర్ర దారం బంగారు పూసల మెరుపుల రాఖీలు
అత్త వారి వాకిట్లో నా చెల్లి ఎదురుచూపులు
ఏమని చెప్పను
ఎట్లా అని చెప్పను
రానే వచ్చే రాకెట్ల పున్నమి
ఏడాది ఎదురుచూసిన నా చెల్లి కి
ఏమని చెప్పను
ఎట్లా అని చెప్పను
రాబందుల రాజ్యం అని చెప్పనా
కామాంధుల క్రోధం అని చెప్పనా (కామాంధుల రాజ్యమని చెప్పనా)
ఆ నాటి ఆసిఫా అని చెప్పనా
నేటి దేవిక అని చెప్పనా
మరెందరో అని చెప్పనా
ఏమని చెప్పను
ఎట్లా అని చెప్పను
నువ్వు అనుకున్న సమాజం కాదు అని చెప్పనా
బాధ అయితుంది తోబుట్టు బంధమా
నీ బానిసత్వం చూస్తే
నాకు నిలకడ ఉండదు నీ స్వతంత్రం ఆపుదాం అంటే ఓ నా తోబుట్టు బంధమా
బద్దలు కొట్టు బానిసత్వాన్ని ఓ నా తోబుట్టు బంధమా
అనుగ తొక్కు నీపై అరాచకాన్ని ఓ నా తోబుట్టు బంధమా
నాకెందుకు అనుకునే సమాజంలో
నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష అని నేను ఎట్లా చెప్పుదు
బంధించ కమ్మ నీ రాఖీ బంధం తో ఓ నా తోబొట్టు బంధమా
ఆపకు అమ్మ నీపై అరాచకానికి ఎదురు వెళుతున్న నన్ను నీ రాఖీ బంధం తో ఓ నా తోబొట్టు బంధమా