మా రచయితలు

రచయిత పేరు:    కొండవేని నరేష్

కవితలు

గజల్..

గాయాలను గేయాలుగ రాయలేక పోతున్నా

భారమైన భావాలను మోయలేక పోతున్నా

 

గతించినా జ్ఞాపకాల భవంతిలో బంధీనై

తలుపుతీసి బయటడుగే వేయలేక పోతున్నా

 

 మోసమన్నదెంత సేపు బాధైతే సమానమే

నువు చేసిన తప్పే చేయలేక పోతున్నా

 

సమాధిలో శవాలుగా కవిత్వాలనే చుట్టీ

కర్కశంగ నా చేతనె తోయలేక పోతున్నా

 

మూగబోయి సాగలేక పదాలుగా పైకెగసే

మనసులోని మాటలనే దాయలేక పోతున్నా

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు