మా రచయితలు

రచయిత పేరు:    అజయ్ మెంగని

కవితలు

విరహ జ్వాల

కలలోనే బాగుంది చెలీ

కనులలోనే నిండావు

కౌగిలివై ఒడి చేరి,వీడిన నుండి

కలతవై మనసులో నిప్పు కనికలా మండావు...

 

కనికరం లేదని అనను నేను

కరుణకి నెలవైన నీ సుగుణాల రూపును...!

వద్దనుకున్నావుగా విరివిగా పంచిన నా వలపును

ఇక నువ్వెదురైనా నా చూపును నీ వైపుకి మలుపను

లోలోన బాధ ఎంత దాగున్నా,నీ లోకానికి తెలుపను

జీవమున్నంత వరకు మరే పడతితో నే జత కలుపను

మళ్ళీ ప్రేమ పేరుతో నా హృదయాన్నెన్నడూ ఉసిగొల్పను

విరుగుడే లేని విరహవేదనతో నా మనసుకి మరెన్నడూ మసిగల్పను...!

 

 

హృదయ వేదన

కాలం గడిచినా కన్నీళ్లు ఆగట్లేవు...

జారుతున్న కన్నీరైనా నా కలాన్ని కదింలించట్లేవు...

మారుతున్న మనుషులే కారణమేమో...

గాయపడిన మనసుకి మసిపూసి మంత్రం వేసారేమో...

అందుకే

బయటకు తెలియకుండా భరించలేని బాధతో...

బతకాలో...చావాలో తెలియని స్థితిలో

మతిమరిచిన మది చితిమంటలో

చిముకు చిముకు మంటూ బూడిదవ్వమంటుంది...

 

కానీ,

నా చావు పలువురి పెదవులపై చిరునవ్వును సమకూర్చినా సరే...

దాంతో వారిలో

అణువణువున తనువంతా ఉదయించిన

అహం,అన్యాయం ,ఆవేశం,అత్యాషలన్నీ

అస్తమిస్తే చాలు...

మరలా రేపటి ఉదయంలో నేనే

రగిలే రవిలా ఉదయించి

ఈ ధరణి అంతటా

ధర్మపు తావినై విరబూస్తా...!!

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు