సృష్టికి జీవం పోస్తూ
లోకంలో వివక్షకు గురౌతూ
గుండెలో బాధను మోస్తూ
కళ్ళలో కన్నీటిని దాస్తూ
ఆదర్శవంతమైన అమ్మలా
ఎదిగే సోదరునికి సోదరిగా
అండా దండా అన్ని నీవై
భర్తకు మంచి భార్యలా
ప్రపంచానికి ప్రేమను పంచుతూ
ఇంటిని చక్కదిద్దుతూ
సహనానికి రూపంగా ఉంటూ
శక్తికి చిరునామాగా నిలిచావు
వనిత నీకు వందనం అభివందనం
ఈ చిరు కవిత నీ గొప్పతనానికి అంకితం