రామాపురం అనే గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు, వారిద్దరూ కలిసి లస్సీ తయారు చేసి అమ్మే వ్యాపారం చేస్తుండేవారు, ఒక రోజు లస్సీ కొనుక్కోవడానికి వచ్చిన పొరుగింటి సుబ్బమ్మ ఏరా సోము నువ్వు ఆ రాము తో కలిసి వ్యాపారం చేస్తే అందులో నీకు ఎం లాభం వస్తుంది రా? నీవు ఒక్కడివే సొంతంగా వ్యాపారం చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి కదా అతనితో కలిసి చేసే కంటే ఈ ఒక్కడే ఎందుకు చేయలేవు అని అ సోముకి అడక్కూడానే అనవసర సలహా ఇచ్చింది, ఆమె మాటలు విని సోము తన స్నేహితునితో ఏరా రాము నేను తనీగా వ్యాపారం చేసుకుంటాను అని తన వాటాతో వ్యాపారం మొదలు పెట్టాడు, చేసేది ఏమీ లేక సోము మౌనంగా ఉండిపోయాడు, సోముకి పొరుగూరిలో ఒక మామయ్య ఉన్నాడు, ఒక రోజు సోము తన మామయ్య దగ్గరికి వెళ్లి అతని దగ్గర చాలా రకరకాల లస్సిలు , మిఠాయిలు తయారు చేయడం బాగా నేర్చుకున్నాడు, తరువాత తన ఊరికి వచ్చి రకరకాల లస్సిలు మిఠాయిలు చేసి అమ్మడం మొదలు పెట్టాడు, కొత్తగా మంచి రకరకాల లస్సీలు మిఠాయిలు అంగట్లో ఉండడంతో బాగా వ్యాపారం పెరిగి రాముకి మంచి లాభాలు వచ్చాయి, సోము ఒకే రకం లస్సి వ్యాపారం చేయడంవల్ల అతని దగ్గర కొనేవారు చాలా తగ్గిపోయారు, దాంతో నష్ట పడిపోయిన సోము ఒకరోజు రాము దగ్గరికి వెళ్లి రాము నన్ను క్షమించు చెప్పుడు మాటలు విని నేను చాలా తప్పు చేశాను నష్ట పోయాను అని బాధ పడ్డాడు,అందుకు రాము బాధపడకు సోము నీ తప్పు తెలుసుకున్నావు ఇక నుంచి మన ఇద్దరం కలిసి మెలిసి వ్యాపారం చేసుకుంటూ మంచి స్నేహితులుగా ఉందాం అని సోముని ఓదార్చాడు ,అప్పటి నుంచి ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకుంటు మంచి స్నేహితులు అనిపించుకున్నారు.
ఈ కథ నీతి
చెప్పుడు మాటలువినకూడదు,
స్నేహితులను అనుమానించకు కూడదు.