మా రచయితలు

రచయిత పేరు:    పుర్ర జ్యోతి

కవితలు

వసుధైక కుటుంబం ఉస్మానియా..

విశాలమైన భిన్నత్వంలో ఏకత్వానికి

భారతదేశం ప్రతీక.          

ఆ వారసత్వాన్ని తన భుజాలపై  మోస్తున్న

చదువుల తల్లి

ఉస్మానియా విశ్వవిద్యాలయం.       

ఒక్కొక్క కళకి ఒక్కొక్క ప్రాంతం పేరెన్నికగలది.

అన్ని కళలను మన కళ్ల ముందుంచిన

కళామతల్లి

కంజాతవల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయం.                            

మట్టి వాసనలను వెదజల్లుతున్న

ఆ తోటలో మొక్కలను మహావృక్షాలుగా,

అందమైన పువ్వుల వనంగా మార్చిన జ్ఞాన వనమాలు లెందరో...

 

గ్రంథాలయం వంటి తాతమ్మ తాతయ్యలు,

సోదర సోదరి భావ మధుర అనుబంధాలు,

బాబాయ్ టీ స్టాల్, ఇలా మరెన్నో మా కుటుంబ బాంధవ్యాలు....

ఒకప్పుడు అర్ధరాత్రి

అరుణోదయానికి ముందు చూసిన ఎన్నో విరోధికృత్తులు...               

ఉద్యమాలలో

రక్తపు దుస్తులు

ధరించిన రోడ్లు ఎన్నో.....   

స్వరాజ్య స్వరాష్ట్రంలో సాధనకు పునాదిరాళ్ళు  ఎన్నో.....  

   

సమ సమాజ నిర్మాణం ఎక్కడిదో కాదు ఇక్కడిదే..

ఆ మందిర ప్రతి పేరుచు పై బంధుత్వ ఛాయాచిత్రాలు ఎన్నో....   

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు