మా రచయితలు

రచయిత పేరు:    సత్య శ్రీ

కవితలు

అమ్మ ప్రేమ

అమ్మ నీవు జన్మనిచ్చావు

పెంచి పెద్ద చేసావు

చక్కగా లాలించావు

నీతి వాక్యాలు చెప్పావు

నైైతిక విలువలు బోధించావు

చాలా ప్రేమగా చూసుకున్నావు

మంచి నడవడిక నేర్పావు

పనులు నేర్పించావు

మంచి చెడులు గుర్తించమన్నావు

కోతి పనులు చేస్తే కొట్టావు

మంచి పనులు చేస్తే మెచ్చుకున్నావు

భయపడితే ధైర్యం ఇచ్చావు

తప్పులు చేస్తే మందలించి దిద్దావు

 

చదువు నేర్పించావు

మా కోసం ఎంతో కష్టపడుతున్నావు

మాకు బాధ కలగకుండా చూసుకుంటున్నావు

రాత్రింబవళ్ళు చెమటోడుస్తున్నావు

మాకు అన్నీ సమకూరుస్తున్నావు

నేను మన పరువు ప్రతిష్ఠలు కాపాడుతానమ్మా...

నేను

ఉన్నతంగా చదివి

భవిష్యత్తులో

మిమల్ని ఉన్నతంగా చూసుకుంటానని

మాట ఇస్తున్నానమ్మా!

        

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు