మా రచయితలు

రచయిత పేరు:    ఓర్సు రాజ్ మానస

కవితలు

ఒంటరి యుద్ధం 
 

తనువు

మనువు మధ్య

అంతరాల దొంతరలు పెరిగి

స్పర్శ సవ్వడుల

సరాగాలు మూగవోయినవి

 

శబ్ద తరంగాలు

నిశ్శబ్ద నిరోష్ట వలయాలకు

సంకెళ్ళ సర్పణలేసి

మౌన ముద్రలను దాల్చింది

 

నిశీలో శశిలా

ఎండిన డొక్కల ఆకలి కేకలు

ఎడారి బతుకుల

అరణ్య రోదాసి రోదనలు

నింగిలోవెల్సిన తారచంద్రులే

మురికికూపంలో

దీవిటై నిల్సింది

 

మలయమారుతంలా 

నివురుగప్పిన మనస్సే

ఎదసవ్వడుల 

సరిగమల రాగం పల్కి

గృహాంతర సీమలో

నవ్వులసిరి మూటలోల్కబోస్తున్నవి

 

ప్రజావాకిటిలో

మహమ్మారి విలోలమై

మరణ మృదంగాన్ని మీటుతూ

మనిషి తరాన్ని

మరణ శయ్యకై

ఆహ్వానం పల్కుతోoది

 

మనం గణంగా సిద్దిస్తే

జగతోద్దరణ సాపాటుగా

ఇల్లే అంత్యోదయాలు పూయిస్తే

కరోనా రక్కసి కొరలు

రక్త సిక్త ద్వారాల గడిలు

ముసుగు పొరలేసుకుంటుంది

 

జనసంద్రం

పద్మవ్యూహా కర్తగా మారి

గరళకంఠ మహతంత్రి వైరస్

కాటి ఇలకాలో

మసిజేస్తే జయమ్మునిశ్చయమౌరా..!

 

నీ మనుగడకు

భాగ్యోదయ

భాగ్యరేఖవై

నవోదయానికి

నాంది రూపమై

సూర్య కింకణ క్వణమై

జ్వలిత జ్వాలల రగ్గులు గప్పి

కరోనా కర్కసి కంఠం

దునిమాడి 

ఒంటరి యుద్ధంచేద్దాం రండి..!!

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు