మా రచయితలు

రచయిత పేరు:    ఆదిమళ్ళ జాహ్నవి

కవితలు

కనికరం లేని కరోన 
 

కరోనా! నీకు కొంచెం కూడా  లేదా కరుణా !

ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలోకి  పరుగులెత్తుకుంటూ వచ్చి...

ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నావు.

ఈ జగం  చేసిన పాపం ఏమిటి ?

పగపట్టి పసివాళ్లను కూడా

చూడకుండా కాటేస్తున్నావు.

ఇది నీకు ఏమైనా న్యాయమా !

పిడికేడు గుండెకు నీ పేరు పరిచయం

చేసి గడగడలాడిస్తున్నావు .

అసలు ఎక్కడమ్మా నీ పుట్టినిల్లు?

దారితప్పిన చిన్నపిల్లల మాదిరి

తిరుగుతున్నావు .

నెలలు గడిచిన నీకు దారి  దొరకలేదా

లేకపోతే ని పుట్టినిల్లు మరిచిపోయి .

మా దేశాన్ని మెట్టినిల్లు అనుకొని

ఇక్కడే ఉండిపోతావా ?

నీ కఠినమైన కౄరత్వానికి 

కంటతడితో కాకుండా..

అందరం కలిసి , ఒకరితో ఒకరం

 కలవకుండా నిన్ను కాటికి పంపుతామని తెలుసుకో..

 ఓ కనికరం లేని కరోనా !!

 

 

     

సముద్ర నీలాలు

ఈ విశ్వమే అగిపోయి...

నా హృది శబ్దము మాత్రమే

గుడిలో గంట మాదిరి

వినబడు క్షణం అది.

 

మన మధ్య అడుగు దూరం

నీ నయనములు మూసి

తెరచు లోగ, నా పానం

పోయి తిరిగొచ్చేలా...,

 

నా అయివు నీ ఊపిరిలో

కలిసిపోయి కొత్తగా

వికసించిన శ్వాసేనేమో

ఈ భావాలకు కారణ.

 

ఆ రెండు క్షణాల్లో

నా జీవిత పయనం

కనపడే నీతో,

అది ఊహగావచ్చు.

 

కానీ,

ఆ ఊహకు కారణం మాత్రం

సముద్రం అట్టి నీళ్లలో

నల్ల చందమామని నాకు పరిచయం చేసిన నీ కనులు.

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు