మా రచయితలు

రచయిత పేరు:    పెద్దపల్లి తేజస్వి

కవితలు

గెలుపు నీ సొంతమే

కాలే కడుపుల బాధ ఎవ్వలికి అర్ధం కాదు.

అర్ధం అయినా చేతనైన సాయం చేద్దామంటే

చేతుల పైసలుండవ్..

లేనోడు సాయం జేస్తున్నడు

ఉన్నోడు కొంపలు ముంచి బాగుబడ్తున్నడు..

మోసబోయేటోడు

మోసబోతున్నడు..

మోసబోయిన మనిషి మోసాన్నే నమ్ముతున్నడు.

గందరగోళం ఏడో లేదు..

నీకు నీవే సృష్టించుకుంటున్నవ్..

సృష్టిల వికసించాలంటే లేనోడికి పెట్టు..

పది కాలాలపాటు సల్లగుండు..

పెట్టుడంటే పొట్టగొట్టి వెలగబెట్టడం గాదు..

గట్ల జేసినవా...!!?

ఉన్నా లేనోడివేనోయ్..   

 

యాదిలుంచుకో..

లేదని ఏడవకు..

మంది మీదబడి తినకు..

తినకుండా ఉపాసం పండు..

చేసేపనిని బద్ధకంతో షురూ జేయుడు మానుకో..

తలబెట్టిన పనులు సక్కబెట్టుకో..

సక్కని అడుగుల్ల న్యాయం ఉన్నదా..

గెలుపు నీ సొంతమే..

 

 

     

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు