మా రచయితలు

రచయిత పేరు:    దొగ్గల రాజు

కవితలు

నేను రాజీ పడను..

నీతో

రాజీ ఒక్కటే శరణ్యం

అంటున్న రాజ్యమా..

నేను నీతో రాజీ పడను

 

నేను స్వేచ్ఛ కోసం

మాట్లాడుతునప్పుడు

నా నోటికి నీవు లాటి

అడ్డం పెట్టిన సరే నేను

నీతో రాజీ పడను..

 

నేను జనం కోసం

రాసే సమయంలో

నా కాగితం పై

ని తూటాలు అడ్డుగోడగా

పరిచిన నేను

నీతో రాజీ పడను..

 

నన్ను చెరసాలలో

బందీగా చేసి నా చుట్టూ

నిర్బంధపు విషవాయువు ను

వదిలిన

నేను నీతో రాజీ పడను..

 

నన్ను మరణం

అంచున పడుకోపెట్టిన

నా చిరునవ్వుతో మరణాన్ని చితిమంట

పేరుస్తానే తప్ప నీతో

రాజీ పడను..

 

నేను కవిని

నా గుండెల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న

ఆశయాల పోరాట స్పూర్తికి

ని లాఠీలు,తూటాలు,

నిర్బంధ విష వాయువులు,

చేదిరిపోక తప్పదు..

 (రెండు సంవత్సరాల క్రితం భీమా కోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన వరవరరావుకి సంఘీభావంగా)

మనం ఎటు వైపు...?

అద్దాల మెడలు ఒక  వైపు..

ఆకలితో కూడుకున్న పిల్లల ఆర్తనాదాలు ఒక వైపు..

అందాల పోటీలు ఒక వైపు..

ఆకలి మంటలు ఒక వైపు...

ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునే పెట్టుబడిదారులు ఒక వైపు...

పడుకోవడానికి 'అరుగు' కూడా లేని నిరుపేద జనం ఒక వైపు...

AC కార్లలో తిరిగే

బడా బాబులు ఒక వైపు..

చేతి నిండా పని లేని

'నిరుద్యోగం' ఒక వైపు...

మతత్వం ఒక వైపు...

మానవత్వం ఒక వైపు...

మట్టి మనుషులపై

దాడులు ఒక వైపు...

దాచేస్తే దాగని నిజాలు ఒక వైపు...

ధనం ఒక వైపు..దారిద్ర్యం ఒక వైపు...

ప్రశ్నించే ప్రజలు ఒక వైపు..

ప్రశ్నను సహించలేని పాలకులు ఒక వైపు..

ఇప్పుడు సమాజాన్ని చదువుతున్న విద్యార్థులు గా మనం ఎటు వైపు...?

ప్రపంచం అంత దోపిడీతో కూడుకున్న సమయంలో మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న...

సూర్యోదయం 

గ్లోబును చుట్టి వచ్చే

ముచ్చటున్న యువకుడా...

వెళ్లే దారిలో

దీనంగా కూర్చున్న కాలి

కడుపును చూస్తూ కూర్చోకు..

అలగాని ఆ కడుపునా

నాలుగు మెతుకులు

పడేసి ఉత్త చేతులు దులుపుకోకు..

ఆ ఆకలి కడుపును,

దీనమైన చూపులను

తట్టి చూడు

నీవు చూడాలనుకున్న

ప్రపంచపు అగాధం

కనిపిస్తుంది..

"ఆకలి రాజ్యం"

విసురుతున్న సవాళ్లు

వినిపిస్తాయి..

బ్రతుకు బండి పై

"మృత్యువు"

చేస్తున్న విలయతాండవం కనపడుతుంది..

సముద్రాలు సైతం

సరితుగని "కన్నీళ్లు"

అనునిత్యం ప్రతిధ్వనించే "ఆర్థనాదాలు"

వికసించే మొగ్గలను

సైతం చిదిమేస్తున్న

"వికృత చర్యలు"అన్ని

దర్శనం ఇస్తాయి..

 

మిస్టర్ రైడర్..

వీటన్నింటినీ చూశాక

ని దిశ ఇవే నిర్ణయిస్తాయి..

చీకటిని పారదోలే సూర్యోదయం వైపు..

 

         -    19/01/2021

నిషేధం..

రాజ్యమా..

ప్రజా సమస్యలు

పరిష్కరించడం తెలియదు నీకు..

ఆ సమస్యలపై పోరాడుతున్న

ప్రజా గొంతుకులను

నిషేదించడం మాత్రమే తెలుసు ...

 

భూమిని కొల్లగొడుతున్న

బహుళ జాతి కంపెనీలను

నిషేధించడం తెలియదు నీకు..

ఆ దోపిడీని ఎండగడుతున్న

ఉద్యమల పై నిషేధం విధిస్తున్నావ్..

 

అమ్ముకోవడం వాడి

అలవాటు..

వాడికి కొమ్ముకాయడం ని అవసరం..

 

నీవు విధించే

నిషేధాలు ధిక్కరించైన సరే

మీ ఇద్దరి మెడలు వంచడం

మా పోరాటం..

 

ఆకలి జోలె

జోలెకు

అటు అతడు

ఇటు నేను..

 

మా ఇద్దరి మధ్య

జోలె పెరు ఆకలి..

 

అల్యూమినియం బిళ్ళ కోసం

ఇద్దరిని దేహీ అంటూ అడిగింది

దేశ భవిష్యత్తు..

 

జోలెకు అటువైపు వ్యక్తి..

ప్రభువు దుఃఖంతో నిండిన

దరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..

ఇటు వైపు నేను..

వస్తే ఛిద్రమైతూ

మన

మద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను..

 

రాం, రహీం,జీసస్

ఎవరచ్చిన అంగట్లో

అర్థకలితో,ఆర్తితో  పోటీపడుతున్న

భవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?

అంతటి ధైర్యం చేస్తారా..?

(కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)

      -

ధీర..

తనకు ధైర్యం ఉంది..

అందుకే వందలమంది మందగా

హక్కులకు అడ్డుగా వచ్చిన

గొంతెత్తి అరిచింది..

 

ఆధిపత్యం పై

ధీక్కారం ప్రదర్శించింది..

 

అణిచివేత పై

ఆయుధం అయింది..

 

కాషాయోన్మాదాన్ని

కసితీరా దిగ్గొట్టింది..

 

అలుముకున్న చీకటి కి

చివాట్లు పెట్టింది..

 

ఆమె పట్ల సానుభూతి

ప్రకటించడం మన పని కాదు..

 

ఆ ధీర నిరసన లో భాగం కావడం

మన బాధ్యత....

 

"అల్లాహ్ హు అక్బర్" దైవం కోసం

పిలుపుకాదిప్పుడు..

ఫాసిస్ట్ రాజ్యంపై పోరాటం..

 

 

        09/02/2022

(For the Solidarity Of Hijab and Muslim Girls)

 

 

 

 

 

           

           

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు