యుద్ధ వీరుడి శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు
దేశం ఆమె ముందు దుఃఖ దృశ్యాల్ని నెలకొల్పింది
బాధాతప్త హృదయంతో స్పృహ తప్పలేదు
ఆమె కనీసం ఒక్క కన్నీటిచుక్కా రాల్చలేదు
స్థాణువులా ఉండి పోయింది
కొనియాడబడిన ఆ వీరుని గుణగణాలు
ఆమెను కదిలించలేక పోయాయి
ముఖం కనిపించేట్లుగా శవం మీది వస్త్రాన్ని
కొంత తొలగించినా ఏ మార్పు లేదు
పరామర్శల మేఘాల స్పర్శ,
పరిసరాల ఓదార్పు ఆర్ధ్రత
ఆమెను ఏమీ చేయలేక పోయాయి
అందరూ శోక సాగరంలో మునిగారు
ఇదే స్థితి కొనసాగితే
ఆమెకు ప్రాణాపాయమని కలవరపడి
ఒక పెద్దావిడ ఆమె పసిపాపను
ఒళ్ళో పడుకోబెట్టింది
సముద్ర తుఫాను వేగంతో
కురుస్తున్న కన్నీటి జలపాతంలో
చలించి పోతున్న బిడ్డను హత్తుకుంటూ,
భోరున ఏడుస్తూ
“నిన్ను దిక్కులేని పక్షిని చేస్తానా,
నేను చనిపోను,
నీ కోసం బతుకుత బిడ్డా”