ఎవ్వరిది స్వాతంత్రం
ఎవ్వడికి స్వాతంత్రం
దేశాన్ని దోచి
దేశాన్ని దాటి
దర్జాగా దావత్ లో
దండిగా మందితో
విందుగా కన్యలతో
విలాసంగా గడిపే
కరుణలేని కామాంధులు
కేసుల మాఫీ తో
అప్పుల కుప్పలతొ
అష్టైశ్వర్యాలతో
అందలమెక్కి ఊరేగుతూ ఉంటే
ఆపే వారు లేక
అంతా లూటీ చేసే
దొంగల దే రాజ్యం
దొంగల దే భోజ్యం
పదవి ముందు వాగ్దానాలు
పదవి తర్వాత ప్రసంగాలు
ప్రజల బారిన విహంగాలు
ఇంకెన్నాళ్లీ దౌర్భాగ్యపు అహంకారాలు
విజ్ఞానానికి పుట్టినిల్లు
విదేశాలకు మెట్టినిల్లు
నేర్చింది ఇక్కడ
సంపాదించేది అక్కడ
బలవంతుల మనే బడాయి
బలహీనుల మనే జులాయి
అవినీతికి అందలం
అధికారులకు విందులు
ప్రసంగాన్ని కే పరిమితం
పనితీరులో మితం
విజ్ఞాన పునాదులo
యాచించే యోధులo
విజయ్ మాల్యా ఎవడు
నీరవ్ మోదీ ఎవడు
చట్టానికి చుట్టాల
లేక పాలకుల చుట్టాల
అవినీతి అంతం ఎప్పుడు
భారతదేశానికి అభివృద్ధి ఎప్పుడు
అవినీతి సంకెళ్ళలో భారతం
ఇంకెన్నళ్ళ బాదరబందీల భారతం
గూగుల్ సీఈఓ మనవాడే
మైక్రోసాఫ్ట్ సీఈఓ మనవాడే
హెచ్ సి ఎల్ సీఈవో కూడా మనవాడే
అని జబ్బలు చర్చి చెప్పుకుందామా!
రొమ్ము విరిచి రాజ్యమేలు దామా!!
గొప్ప లకే మేధావులం
తిప్పలు తప్పని భారతీయులం
ఎన్నాళ్ళీ మేధావుల వలస జ్ఞానభూమి లో
ఎన్నాళ్ళీ జ్ఞానపు కొరత కర్మభూమిలో
పిడికెడు ప్రజల విజ్ఞాన బానిసలం
గంపెడు ప్రజల ఆవిజ్ఞాన గులాంగిరిలం
విజ్ఞులు పంపెను రాఫెల్
మొద్దుబారిన ఆవిజ్ఞాన మెదళ్లు
దోచేది భారతీయుల రక్తపు చెమటలు
దాచేది విదేశీ బ్యాంకుల్లో మూలధనాలు
బంధుప్రీతిల బందీ లో రాజకీయ రాజ్యమా!
బలిపశువు అయిన భారతీయులకు రాజరిక మా
ఊసరవెల్లి రాజకీయాల రంకులో రాజకీయ రాజులు
గురివింద ఆర్భాటాలతో అధికార బోజులు
మంచు కొండలా భారతీయుల కీర్తి
మంచి ని మించిన అవినీతి తిమింగలాల భారతీయుల అపకీర్తి