మా రచయితలు

రచయిత పేరు:    సాయికిరణ్

కవితలు

నీ స్నేహం కోసం......

నేస్తమా...నేను స్నేహానికి వయస్సుతో సంభందం లేదనుకున్నా

కాని నువ్వు చెలిమిగా వుండాలంటే

చెరిసమాన వయస్సు కావాలన్నావు

నేస్తమా...నీ స్నేహ బంధం ముందు రక్తసంబంధాలు బంధుప్రీతి దిగధూడ్పు అనుకున్నా...

కాని నువ్వు స్నేహానికే నిరాకరించావు

స్నేహమంటె అద్దంలో

ప్రతిబింబం అనుకున్నా

కాని నువ్వు నీ అంతర్మథనాన్ని నాతో పంచుకోలేక పొయావు

నాకంటూ ఒక స్నేహం కావాలనుకున్న

స్నేహం కోసం బ్రతకాలనుకున్నా

ప్రాణం ఇవ్వాలనుకున్నా

నువ్వు ఏమనుకొన్నావో

నాకు తెల్వదు

ఈ ప్రపంచమే నిన్ను వెలివేసిన నా చెంతకు తీసుకోవాలనుకున్నా

కాని నీ నిరాకరణ ఈ ప్రపంచమే నన్ను వెలేసినట్టు వుంది

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు