మా రచయితలు

రచయిత పేరు:    రజిత కొండసాని

కవితలు

అమ్మలున్నారు....

ఉమ్మనీటి కొలనులో 

కమ్మని కలలు కంటున్న

అమ్మ కడుపులోని పసిగుడ్డా! 

 

యంత్రం నీ గుట్టు విప్పేసిందిట

నువ్వెవరో  అమ్మల కంటే ముందు యంత్రాలకే తెలుస్తుందిట

శిశువుల చావు బతుకులు యంత్రాల నిర్ణయమట!

 

సంఖ్యలో అయినా సమానత్వాన్ని భరించలేక

మగతనం కత్తులు నూరుతోంది 

నిన్ను తెగ్గోయడానికి

****

 

తల్లుల్లేని జీవజాతి లేదురా ముదనష్టపు హాంతకుల్లారా!

 

బహుశా 

కాపురాలు చేసే ఇల్లాళ్ళు

నెల తప్పగానే

తప్పక కత్తులు చేబూనాలేమో

తమ పిండస్థ రక్తాన్ని 

రక్షించుకునేందుకు!!

 

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు