అమ్మ కడుపులో పడ్డప్పటి నుండి
ఆయువు పోసుకోని భూమిమీద వచ్చినప్పటినుండి
మనసును ముద్దుగా తాకే ముచ్చట్ల కోవెలలో
ఘాటుగా తాకేటి మాటల తూటాల సవ్వడిలో
మొగ్గలుతొడిగిన ఆశల సోయగాలు కొన్ని
ఆవిరి అయిన ఊహల కెరటాలు ఇంకోన్ని
అనుకున్నవి అందుకోలేకపోయామని
అనుకోనివి చిత్రముగా దరికి చేరుతూ
ఊపిరి ఆగిపోతున్నట్టు అలజడి ఓసారి
ఊపిరిని ఇచ్చే సంతోషపు ఊటలు మరోసారి
కానివారు కోసము రాల్చే కన్నీటి బిందువుల జడిలో
అయ్యినవారు మిగిల్చే చేదుగుర్తుల దారిలో
సముద్రములో వచ్చిపోయే అలల లోగిలివలె
జీవితములో వచ్చిపోయే ఆత్మీయ సంఘర్షణల నడుమున
ఎవ్వరూ నావారు కారంటూ మనసు చెప్పే ఘోషలో
నా కోసము నేను వున్నానని మనసు పంచు మమతలోన
సాగిపోతూ జీవిత ఒడిలో కరిగిపోవడమే జీవితము మంటూ
జీవితమే రంగస్థలము అని తెలిసుకోని
మనమే పాత్రదారులని తెలుసుకోని బతుకును దిద్దుకోవుటే జీవితము