పొదరిల్లు వంటి అందమైన ఇంటికి లావణ్యం
హరివిల్లు వంటి ఆనందాల సౌభాగ్యం
పరిశుభ్రతకు పరిచర్యలకు ప్రతి ఇంటికి మహిళలే ఆదర్శం
పరిపరివిధాల పరిరక్షణకు ఇంటికి రా ముఖ్యం... మహిళ.
జీవిత పోరాటంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు
అలసిసొలసి పోరాట పటిమతో ముందు కెళ్ళాలంటే
కత్తి మీద సాము.... కర్ర మీద నడక చేయాల్సిందే
భూమాతకు భారం కాకుండా
భరతమాతకు భాగ్యం కలిగేలా
భర్తకు భార్యగా
బిడ్డకు తల్లిగా
అక్కకు చెల్లిగా అన్ని బంధాలకు
అన్ని బంధుత్వాలకు బంధంగా.... బాధ్యత వహించేది మహిళే.
సమాజంలో మహిళలు ముందుకు వెళ్లాలంటే
ముళ్ళ మీద నడకలు నేర్పరిగా నేర్చుకోవాల్సిందే
అవరోధాలు ఆటంకాలు అడుగడుగున అధిగమించాల్సిందే
కుటుంబం ఉద్యోగం రెండింటిని
సక్రమంగా సకాలంలో బాధ్యత బాధ్యత వహించాల్సింది మహిళే.
కాస్త సహనం ధైర్యం సహజ రీతిలో ఆలోచనా సరళి
మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే
నీ భుజం నువ్వే తట్టుకుని ముందుకు వెళ్లాల్సిందే
కర్తవ్య నిర్వహణ కార్యదీక్షతతో ముందుకెళ్ళు... ఓ మహిళ