మా రచయితలు

రచయిత పేరు:    ఆమని కృష్ణ

కవితలు

కానబాలిజం కోరలు

నిర్భయారణ్య రోదనలో 

మరో దిశా నిర్దేశంబిది          

తరతరాల దొంతరాలలో 

సాగిన కాలమంతా సాగుతున్నదంతా

అబల అలసత్వం నిత్య సత్యం

సబల బలసత్వం ఓ అసత్య వ్రతం

కోమలి జవసత్వం నలిగిన  సూక్ష్మమంతా

'నీకు కూతురు పుట్టిందనే' వగచిన స్తోత్రం 

 

చేతి సంచిలో 

పసికందును తోసి

ఊరి పొలిమేర దాటించి  

కంపచెట్లలో 'ఆడ' ఉనికిని పార వేసిన 

కఠిన హృదయాలెన్నో ?

 

సాక లేననె సాకుతో  

పురిటి బిడ్డను 'అమ్మ' విలువ మరచి

పాతిక వేల మూటకు

పట్టణాల్లో బేర సారమాడిన 

కంపు హృదయాలెన్నో ?

 

ప్రసూతి గదిలోన  

'పిల్ల' పుట్టెనంటు 

తల్లికీ తెలియకుండా

మురికి చెత్త కుండీలో పాల్జేసిన 

కర్కశ హృదయాలెన్నో ?

 

పాలు త్రాగెడి గొంతులో 

వడ్ల గింజలనేసి వేధించి 

'ఆడ' నవజాత శిశువు 

వెచ్చని ఊపిరినాపెడి 

కలుషిత హృదయాలెన్నో ?

 

గొంతు నులిమి

గొంగళిలో చుట్టి 

గుట్టుగా పసి గొడ్డును 

రోడ్డు కాల్వల్లో వేసి 

కాల్జేయి కడుక్కున్న 

మలినత్వపు హృదయాలెన్నో ?

 

'ఆడపిల్ల' వంటు 

అవమాన పరుస్తూ

అమ్మకు తోడుండి

అంట్లు తోమమంటు

బండ చాకిర్లతో బానిసత్వాన్ని

నింపిన కరుణ రసార్థ హృదయాలెన్నో ?

 

చదువు సందెలందు

తిండి తీర్థమందు

ఆట పాటలందు 

అవసరాల దృష్ట్యా

ఆడపిల్లల మీద అదుపాజ్ఞలు 

చేయు అమానుష హృదయాలెన్నో ?

 

మానవతను వీడి

మృగాళ్లుగా కూడి

మందు మత్తు లోన 

మగాళ్ళుగా మారి 

మానవతిని చెరచే 

మాయలమారి హృదయాలెన్నో ?

 

తల్లిదండ్రులు 

అనుంగు బంధువర్గాలు 

సహోదరులు

సహధ్యాయులూ

గురువులు - శిష్యులూ  

తనూభవుల నేపథ్యంలో 

అనాదిగా సాగే మూఢ విశ్వాసాల 

నాటక హృదయాలెన్నో?

 

అమల మానవి జాతి పరిణామ 'దిశ'లో

బంధు రాబందు రెక్కల పరిష్వంగన కవనం

జగాన ఆగని మరణ మృదంగ ఘోషలు

'కానబాలిజం' విషపు కోరల ఆరని కోరికలు  

అనువు గాని చోట మానవత్వపు వెతలు

క్షేత్ర స్థాయిలో ఊరేగు కామాంధుల కథలు

కఠిన కర్కశ కబంధ హస్తముల కరచాలనం 

పుడమిన మగువల మాతృత్వంపై కరవాలం 

 

(ఉత్తరప్రదేశ్-హాథ్రస్ లో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత  స్పందించిన కవిత ఇది

                          

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు