మా రచయితలు

రచయిత పేరు:    ధర్పల్లి సాయికుమార్

కవితలు

ఎన్నో ఏళ్లుగా

ఎన్నో ఏళ్లుగా

అప్పుల్ని అవినీతిని మోస్తూ

ఆకలి కోసం ఎన్నెన్నో

అంతర్యుద్ధాలు చేసి

ఈ దేశం నెత్తుర్ని

ధారబోసింది

ఈ దేశమింక

అప్పుల్ని

అవినీతిని

మోయలేక పోతుంటే

సత్తువ సచ్చిన

ఈ అస్థిపంజర దేహానికి

ఉడుకు నెత్తురు నెక్కించండి

కొన్నికలలు కావాలి

కులం మతం రెండుకళ్ళయి

అభివృద్ధి అంధకారం లో

అణుబాంబులు అణ్వాస్త్రాల కంటే

భయంకరమైన యుద్ధం

ఆకలితో చేస్తున్నది

చౌకగా లభించే

ఈ దేశప్రజల చావులతో

నీకోసం ఎడవడానికి

ఖరీదైన కన్నీళ్ళు కావాలి

పాలకుల అధికార మార్కెట్లో

అమ్మకనికిఉన్న నిన్ను చూస్తుంటే

స్వాతంత్ర సమరయోధులు కన్న

కలలు కావాలి

ఈ దేశానికి కొన్ని కన్నీళ్ళు కావాలి

 

 

యుద్ధం

ప్రపంచ దేశాల

అధికార దాహానికి

రోజుకో దేశం

తన సుందర భసవిష్యత్తును

శిథిలాల్లో దాచుకుని

ప్రపంచ ఆధిపత్యాన్ని

శవాల గుట్టల్లో వెతుకుతూ

ప్రజల నెత్తుటితో

మరణ వాంగ్మూలం

రాస్తున్నది యుద్ధం

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు