నిన్ను నిన్ను గా తెలుసుకుని
సాటి మనిషిగా గుర్తించి
నీకు వలనే హృదయం ఉందని
అందుకోవాలనే ఆశలున్నాయని
కళ్లనిండుగా కలలున్నాయని
రెక్కలున్న ఊహలున్నాయని
స్వేచ్చకోరే మనస్సుందని
ప్రేమింప బడాలనే ఆపేక్షలున్నాయని
గ్రహించాడొక మహామనీషి!
దాని కోసం కథలు రాశాడు
నవలలు రచించాడు
నీహక్కుల కోసం
సమాజాన్నెదిరించాడు!
రాసిన రాతల్లాగే
నిజ జీవితంలో జీవించాడు!
అనురాగం, ఆకర్షణ
మోహం, మమకారం
స్త్రీపురుష బాంధవ్యాల కాలంబన
అవి మృగ్యం అయితే
శృంఖలాలు తెంచుకుని
వెతుక్కుంటూ పోవడం
తప్పులేదన్నాడు!
మహిళల దుస్థితికి దుఃఖంచాడు
మార్పు రావాలని కోరుకున్నాడు
స్త్రీల ఆరోగ్య సమస్యలు
పిల్లల పెంపకాలు
గర్భనిరోధకాల గురించి
సైతం రాసాడు!
చక్కని చిక్కని వ్యవహారికంలో
అసమాన కథాశిల్పంలో చేశాడు.
రచనలెన్నో.----
అప్పటికి అవి కాలాతీతము
ఇప్పటికీ అవి కాలోచితము
తెలుగు సాహిత్యంలో
స్త్రీ స్థానం తెలియాలంటే
చదివి తీరాల్సిందే ఆయన్ని!
అరుణ, శశిరేఖ, పద్మ
రాజేశ్వరుల సృష్టికర్త!
ఎందరితో అర్థంకాని ఎనిగ్ మా!
ఆయనొక మహా ప్రవాహ!
ఒక ఉప్పెన!
సాంప్రదాయ సమాజాన్ని
ఎదిరించిన రెబెల్
నిజాయితీలో ఫర్ఫక్షనిస్టు
మొట్టమొదటి మేల్ ఫెమినిస్ట్
ఆయనో ప్రేమ విసాసి!
అసలు సిసలైన స్త్రీ పక్షపాతి!