మా రచయితలు

రచయిత పేరు:    కడెం లక్ష్మీ ప్రశాంతి

కవితలు

ప్రశ్నార్థం 

మాగురించి ప్రత్యేకంగా

చెప్పుకోవడానికేమీ లేదిప్పుడు

తరాలనాడే మాస్థానమేంటో

నిర్ణయించేసాకా -

ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది?

సమానత్వమంటూ మీరెన్ని

కబుర్లు చెప్పినా సరే -

మీరు రాసిన మా తలరాతలే చెప్తున్నాయి

మీ దృష్టిలో మేమేంటో!

నిజమేంటో తేటతెల్లమయ్యాక

మీరెంత  మభ్యపెట్టాలని చూసినా

ఏంటి ప్రయోజనం!?

మీ అహాలనీడలో బతకడం

అనువార్యమయ్యాక

మాకంటూ ఏం మిగిలిందని!?

మీ అవసరాలకనుగుణంగా

మలచబడిన రోజే

మమల్ని మేము కోల్పోయాం

ఉనికే ప్రశ్నార్ధకం అయినచోట

ఉత్సవాలెందుకు?

ఈ సంచికలో...                     

Jan 2022

ఇతర పత్రికలు