ప్రేమసుధా
శాంతమూర్తి
కరుణాహృదయ
ఎన్నెన్ని పేర్లతో పిలిచినా తక్కువే
నీ ఆప్యాయత ముందు దిగదిడుపే
భానుడితో పోటీపడుతూ సాగే నీ పనుల ప్రహసనం
చంద్రుడు వచ్చినా కనిపించని అసహనం
సెలవులులేని నిత్య శ్రామికురాలివి
మెచ్చుకోలు ఆశించని త్యాగజీవివి
ఇంటాబయటా అలుపెరగని నీ పయనం
ఎంత కష్టపడ్డా తప్పని చులకనభావం
ఆడదానివి అంటూ అనవసరపు ఆంక్షలు
కట్టుబాట్ల పేరిట అడుగడుగునా ముళ్ల కంచెలు
ప్రేమను పంచే అమృతధారవి
అమ్మ, అక్క, భార్యగా నీ సేవలు వెలకట్టలేనివి
కామాంధుల చేతిలో బలి కావొద్దు
ప్రేమ పేరుతో మోసపోవద్దు
నీవల్ల కాదన్న వారికి నువ్వెంటో చూపించు
అవసరమైతే అపరకాళివై విజ్రంబించు
నీ సహనానికి పరీక్ష పెడితే
మనిషికి మనుగడే లేదని నిరూపించు
**********************