నేటి మహిళా...
సంసారమనే సాగరమీదుతూ
సమాజ శ్రేయస్సుకై పాటుపడే
వీర వనిత ఇలల...
అమ్మగా చెల్లిగా భార్యగా
బహుపాత్రలుగా
భాద్యతలు నిర్వర్తిస్తూ
మమతానురాగాలను
పెనవేసుకునే ఓ మాళవిక
మానవత్వపు మాధుర్యం
తెలిసిన కోవెల
మమకారంతో మమేకమై
హృదయాన్ని హత్తుకునే
మాతృమూర్తిలా...
హిమము కన్నా చల్లనైన
మనసు నీది
పాలకన్నా స్వచ్ఛమైన ప్రేమ నీది
కారు మబ్బులో చిక్కుకున్న
చీకటిని సైతం తొలగించే కరుణామయురాలివి నీవే
నాటి సమాజంలో వంటింటికి పరిమితమైన మహిళ
నేటి సమాజంలో అన్ని రంగాలను శాశించే అధిపతివై...
రాకెట్ లా దూసుకుపోతూ
చంద్రమండలపు అంచులను
తాకే మనోధైర్యంతో సాగుతుంది
మహిళ సాధికారతకై
ముందడుగు
నీ నిరాడంబరతయే
తరతరాలకు చెరగని నిధి
మా తరానికి ఈ సమాజానికి
నీవే నీవే ఆదర్శం
మనుషులందరికి మనవి
ప్రతీ మహిళను గౌరవిద్దాం
వారి లక్ష్యాలకు చేరువచేసే
మార్గమవుదాం
వెన్నంటే మనమున్నామన్న
భరోసా ఇద్దాం
తోటి మనుషులమని
చాటి చెప్పుదాం