ఎప్పటిలాగానే వేకువజామున లేచి కల్లాపు చల్లి ముగ్గు వేసి, వంటింట్లో కి వెళ్ళింది భార్గవి. అప్పుడే భార్గవి అత్తగారు తనకి ఎదురు వచ్చారు.
“ఏంటమ్మ భార్గవి ఇవాళ ఆదివారమే కదా ! అందరికీ సెలవే , నిమ్మలంగా నిద్ర లేవచ్చు కదమ్మా , ఎందుకీ ఆర్భాటం?” కటువుగా తన సలహాను చెప్పింది భార్గవి అత్తగారు.
“పర్వాలేదు అత్తయ్య, మీరు మామయ్య గారు , ఆయన , పిల్లలు రోజు టిఫిన్ ఈ టైం కే చేస్తారు కదా అత్తయ్య. ఈ రోజు సెలవ అని ఆ సమయం తప్పకూడదు అత్తయ్య” వివరంగా చెప్పింది భార్గవి ... భార్గవికి కుటుంబం పట్ల ఉన్న బాధ్యత చూసి మనసారా మురిసిపోయింది రాజ్యలక్ష్మి .
అత్తమామల్ని అమ్మనాన్నలు గా చూసే కోడలు భార్గవి ,,,అమ్మానాన్నలు భార్య పిల్లలు తప్ప మరో లోకం తెలియని భర్త అభిమన్యు,,, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు తప్ప రాజలక్ష్మి మామయ్య పాండురంగారావు.
ఒకరోజు అభిమన్యు ఎప్పట్లాగానే ఆఫీసుకు వెళ్ళాడు. ఎప్పుడు ఏడు గంటలకల్లా వచ్చే కొడుకు ,,9:30 అయినా రాలేదని అత్తమామలు కంగారు పడుతుంటే వారికి ధైర్యం చెబుతూ అభిమన్యు ఫోన్కు ట్రై చేస్తుంది భార్గవి. కానీ ఎంత ప్రయత్నించినా ఫోన్ తీయడం లేదు అభిమన్యు .
ఆఫీసుకు ఫోన్ చేసిన అభిమన్యు ఎప్పుడూ వెళ్ళిపోయాడు అని చెప్పారు.
“అబ్బాయి లేట్ అయితే ముందు చెప్పి వెళతాడు కదా రాజ్యం ,,,”,కంగారు పడుతూ అన్నాడు పాండురంగారావు తన భార్య తో.
“ అవునండి!! నాకు చాలా కంగారుగా ఉంది” అని చెప్పింది రాజ్యలక్ష్మి.
అప్పుడు టైం 10:30 , ఇంటి ముందు ఒక అంబులెన్స్ ఆగింది , దాన్ని చూడటంతో భయంతో హడిలిపోయింది కుటుంబమంతా !!!
కాంపౌండర్, అభిమన్యు శవం బయటకు తీశాడు.
“ఏడింటికి ఇంటికి వస్తుంటే లారీ గుద్దుంది” అని చెప్పారు.
ఒక్కసారిగా కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగింది. భార్గవి దుఃఖానికి అంతులేదు.
కర్మ కాండలు , తద్వారా జరగవలసిన కార్యక్రమాలు జరిగాయి . అభిమన్యు చనిపోయి
నెల దాటింది. అభిమన్యు ఙ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు కుటుంబం అంతా.... మా అమ్మాయి కీ ఇంత చిన్న వయసులో ఈ దుస్థితి పట్టింది అని విలపించసాగారు భార్గవి తల్లి దండ్రులు.
కాసేపటికి, " అన్నయ్య గారు, వదినగారు!! మా అమ్మాయికి మరో పెళ్ళి చేద్దామని
నిర్ణయించుకున్నాం. తన జీవితంలో ఇలా సగంలో వర్థంమవ్వడం మాకు ఇష్టం లేదు “ అని భార్గవి తల్లి శకుంతల తన మనసులోని మాట పాండురంగారావు దంపతులకు వెళ్ళబుచ్చింది.
“ఎలాగో మీకున్న ఒక్క కొడుకు పోయాడు,, ఈ ఇల్లు, ఆ మూడు ఎకరాల పొలం అంతా పిల్లల పేరు మీదనో, మా భార్గవి పేరు మీదకు మార్చడం ఇప్పుడు మీరు చేయాల్సిన పని అన్నయ్య” అని తన దురాశను బయట పెట్టింది శకుంతల ..
ఈ పరిస్థితుల్లో ఏమి మాట్లాడాలో తెలియక పాండురంగారావు దంపతులు మౌనంగా ఉండిపోయారు...అప్పటివరకు ఓ మూలన దు:ఖ లోకంలో కూరుకుపోయినా భార్గవి ఒక ఉదుటున తన తల్లి మీదకు లెచ్చింది.
“అమ్మా!! ఇప్పుడు నా దారి నేను చూసుకుంటే అత్తయ్య, మామయ్య పరిస్థితి ఏంటి? నా భర్త ఉన్నంత కాలం అందరం కలసి ఉన్నాము. ఇప్పుడు ఆయన పోయాక నా దారి నేను చూసుకోవాలా?? వద్దు అమ్మా, !! అత్తయ్య, మావయ్య వాళ్ళను, ఆయన ఙ్ఞాపకంగా మిగిలిన పిల్లలని చూసుకుంటూ ఇలాగే ఉండిపోతాను. నాకు ఆస్తి మీద , ఇంకో పెళ్ళి మీద ఆశ లేదు” అని ఖరాఖండిగా చెప్పేసింది భార్గవి .
" ఏంటి భార్గవి ఇలా మాట్లాడుతున్నావు? నీకంటూ ఒక జీవితం ఒక తోడు అవసరం లేదా?? నీ పిల్లలకు నాన్న అవసరం లేదా??” ఆశ్చర్యంతో కూతురు మీదకు ప్రశ్నల బాణం వేసింది శకుంతల .
“నాకు అమ్మనాన్నల్లాంటి అత్తమామలున్నారు. నాకు ఎవరి అవసరం లేదు. ప్రాణంలా చూసుకున్న ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణం అయినా ఈ కుటుంబాన్ని చూసుకోవడం ఈ ఇంటికి కోడలిగా నా బాధ్యత “ తన నిర్ణయం ఇదే అని నిక్కచ్చిగా చెప్పింది భార్గవి.
ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయారు భార్గవి తల్లిదండ్రులు.
కొన్ని రోజులు గడిచాయి,, శకుంతల వాళ్ళ బంధువులను పంపి భార్గవికి నచ్చజెప్పాలని చూసినా తన ప్రయత్నం ఫలించలేదు. కొడుకు పోయినా కోడలి రూపంలో కూతురిని ఇచ్చాడు ఆ పైవాడు,, అని మనసారా భార్గవి దీవించారు పాండురంగారావు, రాజ్య లక్ష్మి. ఇరుగుంటి వారు , పొరుగింటివారు భార్గవి మంచితనాన్ని మెచ్చుకున్న వాళ్ళు కొందరైతే, ఆస్తి కోసం తను వేసే ఎత్తుగడ అని నిందలు వేసిన వారు ఇంకొందరు. ఇవేవీ భార్గవి పట్టించుకోలేదు. ఉండబట్టలేక పాండురంగారావు దంపతులు భార్గవిని మరో పెళ్ళి చేసుకొమ్మని, ఆస్తి తన పేరున రాయబోయారు. అందుకు భార్గవి ఒప్పుకోలేదు. పైగా ఇంటిని పోషణ తన బాధ్యతగా తీసుకొని, తను ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది భార్గవి. ఒక రోజు భార్గవి ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా తనకు చదువు చెప్పిన జనార్ధన్ మాష్టారు కలిసారు. అభిమన్యు మరణ వార్త విని ఎంతో బాధపడ్డారు.
“వేరు కాపురం పెట్టించే కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో, నువ్వు కూతురుగా మారి నీ అత్తమామల్ని చూసుకుంటున్నావు చాలా గొప్ప మనస్సు అమ్మ నీది” అని భార్గవిని ఆశీర్వదించారు జనార్దన్ మాష్టారు.
ఇందులో తన గొప్పతనం ఏమీలేదని , “మీరు చదువుతో పాటు నేర్పిన విలువలను నేను ఆచరించాను గురువుగారు. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ తోడు ఉంటాయిగా “ అని అన్నది భార్గవి....
“తప్పకుండా ఉంటాయి అమ్మ భార్గవి,,,నేను ఒక రోజు వచ్చి మీ కుటుంబాన్ని కలుస్తాను. ఉంటాను భార్గవి” అని చెప్పి జనార్ధన్ మాష్టారు ఎదో పని ఉన్నట్టుగా అక్కడి నుండి వెళిపోయారు. భార్గవి కూడా ఇంటికి వెళ్ళిపోయింది
రెండు నెలల గడిచాయి. ఒక రోజు అభిమన్యు ఆఫీస్ నుండి భార్గవికి ఫోన్ వచ్చింది. తను వెంటనే ఆఫీస్కు వెళ్ళింది.
“అమ్మా భార్గవి అభిమన్యు మరణం నాకు ఇప్పటికి బాధగా ఉంటుంది, నేను ఇంకా ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. మీ వారి పిఎఫ్ కటింగ్స్ , ఆఫీస్ తరుపు నుండి 20 లక్షల దాకా వస్తాయి, ఆ చెక్ ఇవ్వడానికి నిన్ను పిలిపించాను” అని అన్నారు మేనేజర్.
చెక్ తీసుకుని, మేనేజర్ కి థ్యాంక్స్ చెప్పి, ఇంటికి చేరుకుంది భార్గవి. భార్గవి ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పింది.
“అత్తయ్య గారు, మామయ్య గారు , ఈ ఇరవై లక్షల డబ్బులో కొంత పిల్లల చదువులకు , మరి కొంత మీ ఆరోగ్య రిత్యా బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాము, ఇక మిగిలిన డబ్బులతో కిరాణం షాపు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. మీ నిర్ణయమే నా నిర్ణయం” అని వివరించింది భార్గవి.
“మంచి ఆలోచన అమ్మ భార్గవి, మాకు ఇంత గొప్ప కోడలు!! కాదు కాదు కూతురిని ఆ దేవుడు అందించాడు , ఇక కిరాణం షాపు బాధ్యత మాది, నువ్వు ఉద్యోగం కొనసాగించు” సంతోషంగా
చెప్పారు భార్గవి అత్తమామలు. భార్గవి కూడా ఆనందంగా రాజ్యలక్ష్మిఒడిలో ఒదిగిపోయింది.