మా రచయితలు

రచయిత పేరు:    అలేఖ్య రవికాంతి

కవితలు

స్త్రీ శక్తి 

సృష్టికే ప్రతి సృష్టిని నేను

బేల అబలనని అనుకోను

ఆదిపరాశక్తి అంశే నేనని 

నిమిషమైన మరువను

 

ఘడియైనా అలుపెరగని గడియారాన్ని 

విశ్రాంతి ఎరుగని మానవ యంత్రాన్ని

భూమాత మానసపుత్రిని నేను

ఆల్ రౌండర్ పదవికి రాణినై నిలిచాను

 

పువ్వంటి దేహామైతేనేం 

కష్టాలకు నలగనివ్వను

సహనాన్ని చెదరనివ్వను 

కుటుంబమనే ప్రమిదలో 

దీపమై వెలుగునిస్తూ

 

స్త్రీ శక్తి  రగిలే నిప్పు కణిక

ఏనాడో చరితను తిరగరాసాను 

వీర నారీ ఝాన్సీ రాణినై

రుద్రమదేవి సామ్రాజ్ఞినై 

జాతి భవితకు ఊపిరోసాను 

కవయిత్రి మొల్లనై జగతిన

సాహిత్య సౌరభాలను వెదజల్లినాను

 

మానవ మనుగడలో

అడుగడుగున శక్తినై

కుటుంబ పాలన నుండి 

రాజ్యపాలన వరకు అన్నింటా 

వేసాను చెరిగిపోని ముద్ర 

స్వేచ్చా, స్వాతంత్ర్యాలకు 

నిరంతరం ఊపిరోస్తూ..! 

 

************************ 

 

 

ఈ సంచికలో...                     

Jan 2022

ఇతర పత్రికలు