మా రచయితలు

రచయిత పేరు:    టి జమున

కవితలు

నీ రూపం వెనుక

ఓ మగువా అందమైన నీ రూపం వెనుక

అగాధాలు ఎన్నో అంతులేని విషాదాలు ఎన్నో

పైకి నవ్వేను రూపం

లో లోపల నలిగిన హృదయం

దారి కాచెను మృగం  

వెంటాడి వేటాడటం దాని నైజం

కరుణించదు దైవం  

కాటు వేయక మానదు కాలం

అయినా నిన్నే నిందించేను ఈ సమాజం

ఎక్కడున్నది మనిషికి మానవత్వం

జీవజాతులు సైతం తమ జాతిని తాము కాపాడుకుంటున్నాయి  ప్రతిక్షణం

మరి సాటి మనుషుల పైన మనకెందుకు ఈ రాక్షసత్వం

అయినా మనం మనుషులం దైవానికి ప్రతిరూపాలం  

అన్ని తెలిసిన అమరులం కానీ దౌర్భాగ్యులం


 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు