హిమాజ పేరుకు తగ్గట్టే అందమైన, తెలివి గల అమ్మాయి, ఐదోయేట పోలియో వచ్చి ఒక కాలు చచ్చు బడిపోయింది. తల్లి లేని అమ్మాయి కోసం మాధవిని పెళ్లి చేసుకున్నాడు తండ్రి. కొత్తలో అమ్మాయిని బాగానే చూసుకునేది మాధవి. తనకు ఇద్దరు పిల్లలు పుట్టాక, హిమజని సరిగ్గా చూసుకొక ఇంట్లో పనులన్నీ తన చేత చేయించేది సవతి తల్లి. భార్య గయ్యాళి తనానికి తండ్రి ఏమి అనేవాడు కాదు.
టెన్త్ దాకా ఎలానో కాలం గడిచింది. స్కూల్ లో వికలాంగుల పెన్షన్ అందేది. టెన్త్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది
కాలేజీ వాళ్ళు ఫ్రీ సీటు ఇచ్చారు వికలాంగుల హాస్టల్లో కూడా ఫ్రీ సీటు ఇచ్చారు.
ఇంట్లో నీ బాధలు చూడలేక పోతున్నాను తల్లి అని తండ్రి హాస్టల్ కు పంపాడు.. పూర్తి సమయం చదువుకే కేటాయించింది.
ఆటపాటల్లో కూడా పాల్గొనేది. ఆ సంవత్సరం ఒక సేవా సంస్థ వారు వికలాంగులకు ఆటల పోటీలు పెట్టీ గెలిచిన వాటికి పర్వతారోహణ కు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
హిమజ అన్నిటిలోనూ ప్రధమంగా నిలిచింది.
పర్వతారోహణ శిక్షణా పరీక్ష లో కూడా ఎంతో ఆత్మవిశ్వాసం తో నేర్చుకుని ప్రధమం గా నిలిచింది.
శిక్షణ లో ఉత్తమంగా నిలిచిన వాళ్ళను ఎవరెస్ట్ అధిరోహణకు అవకాశం ఇచ్చారు.
ఒక కాలుతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వికలాంగ వనితగా పత్రికల్లో హిమజ పేరు మారుమోగింది.
గవర్నమెంటు వారు ఆమె ధైర్యానికి, ఆత్మ విశ్వాసానీకి మెచ్చి పర్వతారోహణ విద్యార్థులకు శిక్షకురాలిగా ఆమెకు జాబ్ ఇచ్చారు.
****
పంటలు పండక .. ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని .. పట్నం లోనే తల్లిదండ్రులు చిన్న కంపెనీలో పని చేస్తున్నారు అని తెలిసిన హిమజ వాళ్ళ అప్పులన్నీ తీర్చేసి, అమ్మిన పొలాన్ని వాళ్లకు కొనిచ్చింది
సవతి తల్లి " నీకు ఒక కాలు పని చేయదు అని తెలిసి కూడా నిన్ను పట్టించుకోకుండా ఎన్ని బాధలు పెట్టినా, అవన్నీ పట్టించుకోకుండా నా పిల్లలను సొంత తమ్ముళ్ళ లా చదివిస్తున్నావు. ఆత్మ విశ్వాసంతో ఎవరెస్ట్ ఎక్కి "ఎవరెస్ట్ అంత ఎదిగావు" "అవయవ లోపం ఉన్నవాళ్లు కాదు మనసులో కల్మషం కలిగిన వాళ్ళే నిజమైన అంగ వైకల్యం కలవాళ్ళు" అని నిరూపించావు. నేను క్షమించు తల్లీ" అని కన్నీళ్ళతో వేడుకుంది.