నేటి భారతం సత్యా హింసల గాంధీ పథం
కనుమరుగయ్యే దశ’దిశ’లా
మేకవన్నె పులలెన్నో సంచరించె
‘నిర్భయ’ము గా రఘురాముడు ఏలిన రాజ్యన
అష్టాంగమార్గం అభాసుపాలయ్యె
‘సమత’ లేని బుద్ధ భూమిలోన
మతిలేని చేతల ‘ప్రవీణు’డి పశువాంఛకు
రాలిన తొమ్మిది నెలల పసి మొగ్గ పరిహసించె
పండిత నెహ్రూ పుట్టినరోజున
కలడు కలడనెడు వాడు కలడో లేడో అన్న
అసహాయ గజేంద్రుని ఆర్తి విన్న భాగవత
పురాణ పుణ్య దేశాన
ఉన్నాడో లేడో అన్న సందేహమే మిగిలే
‘ఉన్నావో’ అన్న ఘటన వలన
మానవత్వపు పరిమళాలను వెదజల్లే
మనిషితనం మాయమయ్యే నరనరాన
ఆడవారికి బ్రతుకే భారమయ్యే నేటి భారతాన