వాడు
కిలో ఉల్లిగడ్ద
రెండొందలైనా నోరిప్పడు
వాడు
ఆకలితో నక నక లాడే
జనం గురించి
కనీస విషాదం వెలిబుచ్చడు
వాడు
సదువంతా సర్కారులోనే
ఉండాలని యెన్నడూ కోరుకోడు
వాడు
సదువులోన అమ్మ భాష
పనికే రాదంటాడు
అంగ్ల భాషే ముద్దంటాడు
వాడు
సదువుల తల్లి సరస్వతంటాడు
కాని మహిళలు మాత్రం
వంటింటి కుందేల్లంటాడు
వాడు
కార్పోరేటుకు రెడ్ కార్పెట్ పరిచే
సర్కార్ను చూస్తే వానికెంతో సంతొషం
మట్టిలోని వనరులెన్నో మటుమాయమైనా
మాటవరుసకైనా వాడు మనసిప్పడు
వాడు
రాజ్యంగపు రాతల్ని
నిరంతరం చెరిపెయ్యాలని
చూస్తూ ఉంటాడు
పైగా వాడు
అసలు సిసలైన
దెశభక్తున్నని
తెగ ప్రచరం
చెసుకుంటునే ఉంటాడు
సమాజాన్ని అతలాకుతలంజెసే
సామజిక సమస్యలపై
స్వేచ్చగా చర్చించే వాల్లంతా
దేశద్రోహులేనట
వాడొక్కడే
అసలు సిసలైన
నికార్సైన దేశభక్తుడంట