మా రచయితలు

రచయిత పేరు:    రివేరా

కవితలు

బ్లింకని చేపకన్ను 

బయలుదేరాను నా పోలికలతో

రాలిన చెట్ల కింద పండిన

ఆకుల్లోంచి దారులేసుకొంటూ..

తెమ్మెరల వెంట

తుంటరి పిల్ల గునగునల గుండా..

 

నా పోలికలతో బయలుదేరాను

రీజన్ ను ఫ్యూజన్ లో వెతకకు

సంగీతం పెట్టెనలా కలబెట్టకు

డిస్మెంటల్ కాని పార్టుంటే అది

బొంగరాలాటలో చితగ్గొట్టి

ఉప్పురాసిన పాదముందే అదే

నాదని పోల్చేసరికే సగం తెల్లారే

రుస్తుం పోజు, జబర్దస్త్ వేషం

మెడలో తాయెత్తు, రామసీత దొడ్లో గమ్మత్తు

గాలిబొక్కల తెర నిండా పూలజడ

చలికాలాలకు వెచ్చటి గువ్వల ఒళ్లు దిష్టి

ఇప్పుడంటే గడియారాలపై నిఘాపెట్టి

పడుకొంటున్నాంగానీ

బాలసంతుల జేగంటలే మేలికొలుపు

కాణాలపై నుంచి అప్పుడేసిన పల్టీ

ఇప్పటికీ గాలిలోనే..బ్లింకని చేపకన్నులా..

 

ఇప్పుడే అన్నట్టు

ఇప్పుడు కాక ఇంకెప్పుడన్నట్టు

ఇప్పుడు కాక మోకా రాదన్నట్టు

బయలుదేరాను నా పోలికలతో 

ఊరు లేని, ఊరేగింపులు లేని

వినేవారూ, చెప్పేవారూ లేని

తావుల్లోకి కానల్లోకి...

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు