మా రచయితలు

రచయిత పేరు:    కొర్లపాటి శేషు

కవితలు

పొదుపురా అబ్బాయి

పొదుపురా అబ్బాయి

మాటల పొదుపు చెయ్యి

నీ నోరు అదుపు చెయ్యి

షాహీన్ బాగ్ వీదిలో

వొనుకు పుట్టించే ఢిల్లీ చలిలో

48రోజులుగా

ఆ ఆడోళ్ళు

ఇల్లూవాకిలి వదిలి

ఎందుకు అలా కూర్చున్నారు

ఎందుకు ఆ నిరసన గొంతువిప్పి

దేశం ముందు పోస్తున్నారు

ఎప్పుడైనా ఆలోచించావా

ఎందుకు ఆరాతీసావా

తిన్నదరక అని మాట తూలకు

ఒళ్ళుబలిసి అని నోరు జారకు

ఎవరో ఉసిగోలిపితే

మరెవరో రెచ్చగొడితే

అదే పని నువ్వు చెయ్యగలవా

కనీసం

నీ ఇంటి ముందైనా

ఓ గంట కూర్చో గలవా

అందకేరా అబ్బాయి

మళీ చెబుతున్న

మాట పొదుపు చెయ్యి

నోరు అదుపు చెయ్యి

నీ డబ్బులు నీకివ్వడానికి

నిన్ను గంటలతరబడి క్యూలో నిలబెట్టినవాడు

రేపు నీ బ్యాంక్ అకౌంట్ కాళీ చేయబోతున్నాడు

అప్పుడు

కృష్ణార్పణమని కళ్ళు మూసుకుంటావో

లబోదిబోమని గుండెలు బాదుకుంటావో

త్వరగా తేల్చుకో

గుండెకు పట్టిన జలాగ వాడు

ఎక్కువ కాలం ఆగడు

నికెక్కిన దేశభక్తి వదిలేలోగా

నిన్ను మొత్తం దోచేస్తాడు

నీ మత్తు దిగితే

పక్కదేశం మీద యుద్ధమంటాడు

మళ్ళీ నిన్ను అదే మత్తులో ముంచుతాడు

నీ ఇంటికీ వస్తాడు

నీ తాత బర్త్ సర్టిఫికెట్ అడుగుతాడు

బిత్తర చూపులు చూస్తావో

చెప్పుతో సమాధానం చెబుతావో

ఇప్పుడే ఆలోచించుకో

చాప కింద ఆసిడ్ వాడు

ముడ్డి కాలకముందే తేరుకో.

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు